
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. “బీస్ట్ మోడ్ ఆన్” పేరుతో సోషల్ మీడియాలో తారక్ షర్ట్‌లెస్ బ్యాక్ లుక్ వైరల్ అవుతోంది. జిమ్‌లో తీసిన ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ లుక్‌తో పాటు మరో ఆసక్తికరమైన విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో తొలుత టొవినో థామస్ చేయాలనుకున్న పాత్ర కోసం ఇప్పుడు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాదిన ఈ విషయం విస్తృతంగా వైరల్ అవుతోంది. ఇటీవల హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చేసిన తారక్, ఇప్పుడు తన సినిమాలో మరో బాలీవుడ్ నటుడికి అవకాశం ఇస్తున్నారనే వార్త అక్కడ ఉత్సాహాన్ని నింపుతోంది. కబీర్ సింగ్ చిత్రంతో షాహిద్ కపూర్‌కు సౌత్ ప్రేక్షకులతో పరిచయం ఉంది.