
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడిన హీరోయిన్ రష్మిక మందన్నకు ఆమె తండ్రి మదన్ అరుదైన వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చారు. సొంతూరిలో ఆయన పేరు మీద ఉన్న ఇంటిని రష్మిక పేరు మీదకు బదిలీ చేశారు. విరాజ్‌పేటలోని చెంచెబెల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుక్లూరు గ్రామానికి చెందిన, ముండచాడి నివాసి, విరాజ్‌పేట టౌన్ పంచాయతీ మాజీ సభ్యుడైన రష్మిక తండ్రి మదన్ మందన్న, అతని భార్య సుమన్ మందన్న.. తమ పేరు మీద ఉన్న 142/1,142/2 సర్వే నంబర్లతో ఉన్న విలాసవంతమైన (సెరెనిటీ) ఇంటిని విరాజ్‌పేట సబ్ -రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ కుమార్తె రష్మిక మందన్న పేరు మీదకు బదిలీ చేశారు.
రష్మిక మందన్న ఇటీవల విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొడగులో కూడా విజయ్, రష్మిక వివాహ రిసెప్షన్ జరిగింది. ఈ ఇంటిని రష్మిక తండ్రి కూతురికి పెళ్లి కానుకగా ఇచ్చారని కుటుంబ వర్గాలు తెలిపాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రష్మిక, ఆమె తల్లిదండ్రులు.. మందన్న ఫ్యామిలీ లాయర్ పట్టాడ రీనా ప్రకాష్, రష్మిక మందన్న వ్యక్తిగత మేనేజర్ స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫొటో కూడా దిగారు.
►ALSO READ | Zareen Khan: హీరోయిన్ ఇంట వరుస విషాదాలు.. కన్నీటి కథగా మారిన నటి ఫ్యామిలీ!
రష్మిక తండ్రి మదన్ మందన్న కొడగులోని విరాజ్‌పేటలో వ్యాపారవేత్త. ఆయనకు సొంతూరిలో కాఫీ తోటలు ఉన్నాయి. రష్మిక తల్లి సుమన్ మందన్న హౌస్ వైఫ్. రష్మికకు షిమన్ మందన్న అనే చెల్లెలు ఉంది. రష్మిక, షిమన్‌ల మధ్య సుమారు 17 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. వీరిది కొడవ కుటుంబం. రష్మిక ఇంట్లో కొడవ సంస్కృతి, ఆచారాలను పాటిస్తారు.
రష్మిక విరాజ్‌పేటలోని కొడగు పబ్లిక్ స్కూల్‌లోనే చదువుకుంది. ఆ తర్వాత.. బెంగళూరుకు వెళ్లి ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైంది. రష్మిక తన కాలేజ్ డేస్లో మోడలింగ్ చేసేది. 2014లో.. ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్’ పోటీలో రష్మిక విన్నర్గా నిలిచింది. ఈ క్రమంలోనే.. దర్శకుడు రిషబ్ శెట్టి ఆమె ఫోటోను చూసి ‘కిరిక్ పార్టీ’ సినిమా కోసం ఆమెను ఎంపిక చేశారు. కన్నడలో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మిక లైఫ్ పూర్తిగా మారిపోయింది.