
IPL 2026: గౌహతిలో వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. డక్ వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ముంబైతో జరిగిన కీలక పోరులో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ లో హ్యాట్రిక్ గెలుపుల్ని రాయల్స్ నమోదు చేసుకుని పాయింట్ల పట్టికల్ టేబుల్ టాపర్ గా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకి రాజస్థాన్ బిగ్ షాక్ ఇచ్చింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ ( 32 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు నాటౌట్ ), వైభవ్ సూర్యవంశీ ( 14 బంతుల్లో 1 ఫోర్ 5 సిక్సులతో 39 పరుగులు) అద్బుత ఆరంభాన్ని అందించారు. 80 పరుగుల వద్ద ఈ జోడిని శార్దుల్ ఠాకూర్ వీడదీశాడు.
ఇక 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకి తొలి ఓవర్లలోనే బిగ్ షాక్ తగిలింది. జోఫ్రా అర్చర్ వేసిన ఫస్ట్ ఓవర్లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (8) ఆడిన బాల్ నేరుగా వికెట్ కీపర్ ధృవ్ జురెల్ చేతిలో పడటంతో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్ లోనే క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(6) ని నాండ్రే బర్గర్ వేసిన ఓ సూపర్బ్ బంతిని భారీ షాట్ ఆడబోయి అర్చర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు. ఇక మూడో ఓవర్లో సందీప్ శర్మ వేసిన అద్భుతమైన బంతికి రోహిత్ శర్మ (5) LBWగా వెనుదిరిగాడు. దీంతో కేవలం 22 పరుగులకే కీలకమైన 3 వికెట్లని నస్టపోయింది ముంబై ఇండియన్స్ జట్టు.
అనంతరం క్రీజులో వచ్చిన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ, నెట్ రన్ రేటుని తగ్గించే ప్రయత్నం చేసే క్రమంలో రవి బిష్ణోయ్ బౌలింగ్ లో హార్దిక్ లాంగ్ ఆఫ్ మీదుగా ఆడిన భారీ షాట్ బౌండరీ వద్ద యశస్వీ జైస్వాల్ క్యాచ్ పట్టుకోవడంతో పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత బంతికే తిలక్ వర్మ (14) కొట్టిన బంతిని షిమ్రాన్ హెట్‌మయర్ అందుకోవడంతో మైదానం వీడాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి, ముంబై జట్టుని దెబ్బతీశాడు రవి బిష్ణోయ్. అనంతరం క్రీజులోకి వచ్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి మధ్య నెలకొన్న 47 పరుగుల భాగస్వామ్యాన్ని
తుషార్ దేశ్‌పాండే వీడదీశాడు. తుషార్ బౌలింగ్ లో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (25) భారీ షాట్ ఆడగా అది నేరుగా వెళ్లి సందీప్ శర్మ చేతిలో పడటంతో పెవిలియన్ కి వెళ్లిపోయాడు. 107 పరుగుల వద్ద 7వ వికెట్ గా నమన్ ధీర్ (25) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన శార్దూల్ ఠాకూర్ (8) అవుట్ కాగా అనంతరం క్రీజులోకి వచ్చిన ట్రెంట్ బోల్ట్ (1) చివరి ఓవర్లో జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో రనౌట్ కావడంతో ముంబై ఇండియన్స్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు తీసుకోగా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ పడగొట్టారు.
Sherfane Rutherford & Naman Dhir depart after fighting cameos 🫣#RR on the brink of a victory 🩷#TATAIPL | #KhelBindaas | #RRvMI pic.twitter.com/2fFCRwBoSw
— IndianPremierLeague (@IPL) April 7, 2026