Reading Time: < 1 minute

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లోకి నిప్పంటించుకుని వెళ్లిన కుర్రాడు !

Caption of Image.

కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసుకుని వరుణ్ ఆనే యువకుడు నిప్పంటించుకున్నాడు. యువకుని స్వస్థలం షాద్ నగర్ అని పోలీసులు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం వల్లంపాడు గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకునేందుకు వరుణ్ కరీంనగర్ వెళ్లాడు.

అమ్మాయి తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకున్నప్పటికీ.. అమ్మాయి తల్లిదండ్రులు మీరే అని ఆధారాలు తీసుకురావాలని పోలీసులు కోరారు. దీంతో.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మనస్తాపంతో పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసుకొని వరుణ్ నిప్పు అంటించుకున్నాడు. పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడు.

తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వరుణ్ ను పోలీసులు తరలించారు. వరుణ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

©️ VIL Media Pvt Ltd.