Reading Time: 2 minutes

G33 Title: గోపిచంద్ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్..‘ఘాజీ’ దర్శకుడి భారీ ప్రయోగం ఫలిస్తుందా?

Caption of Image.

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపిచంద్ టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘G33’.  ‘ఐబి71’, ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి చిత్రాలతో తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన సంకల్ప్ రెడ్డి, ఈసారి భారతదేశ చరిత్రలో మరుగున పడిపోయిన ఒక వీరోచిత ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వినిపిస్తోంది. 

‘భరత వర్ష’ టైటిల్‌:

శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా 7 వ శతాబ్దానికి చెందిన కథతో వస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ సినిమాకు ‘భరత వర్ష’ (Bharatha Varsh) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఇంతకుముందు ‘కాలాగ్ని’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ, అది ఫైనల్ కాకపోవచ్చని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రమోషన్స్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రంలో టాలెంటెడ్ బ్యూటీ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. ఆమె ‘సత్యవతి’ అనే కీలక పాత్ర పోషిస్తుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకునే రీతూ వర్మకు, ‘సత్యవతి’ పాత్ర కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

యదార్థ గాథతో..

దర్శకుడు సంకల్ప్ రెడ్డి గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇప్పటివరకు భారతీయ వెండితెరపై చర్చకు రాని, చరిత్ర పుస్తకాల్లో దాగి ఉన్న ఒక యదార్థ గాథను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా కోసం గోపీచంద్ తన లుక్ మార్చడమే కాకుండా, ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా తీసుకున్నారు. గోపీచంద్ మార్క్ యాక్షన్, సంకల్ప్ రెడ్డి మార్క్ మేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

వరుస ఫెయిల్యూర్స్..

సంకల్ప్ రెడ్డి గత చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. వరుణ్ తేజ్తో అంతరిక్షం, ఆ తర్వాత ‘ఐబీ-71’ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక అప్పటి నుండి రెండేళ్లు ఖాళీగా ఉన్న సంకల్ప్.. గోపీచంద్ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట. అందుకోసం ఈ కథ నేషనల్ లెవల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సంకల్ప్ రెడ్డి రూపొందించినట్లుగా టాక్. 

అలాగే, ప్రస్తుతం హీరో గోపీచంద్ చేసే సినిమాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆయన ఎంచుకునే కథలు ఆడియన్స్కి ఏ మాత్రం కిక్ ఇవ్వట్లేదు. వరుస సినిమాల్లో నటిస్తే సరిపోతుందా.. కథ, కథనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

వరుసగా రామబాణం, భీమా, విశ్వం సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఇక గోపి చంద్ ఆశలన్నీ సంకల్ప్ రెడ్డి మీదే ఆధారపడి ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా  మ్యాచో స్టార్ మళ్ళీ ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి!

©️ VIL Media Pvt Ltd.