
హరిద్వార్: నిఠారి హత్యల కేసులో నిందితుడిగా శిక్ష అనుభవించి.. ఆ తర్వాత నిర్దోషిగా విడుదలైన సురేంద్ర కోలి.. శుక్రవారం హరిద్వార్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా హరిద్వార్‌లో టీ అమ్ముతున్న కోలి, తన టీ స్టాల్‌లోనే ఉరి వేసుకుని కనిపించాడు. ఉత్తర హరిద్వార్‌లోని సప్త సరోవర్ ప్రాంతంలో లాల్ మాతా ఆలయానికి ఎదురుగా ఉన్న టీ దుకాణంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
అల్మోరాలోని కోలి కుటుంబ సభ్యులకు అతని చనిపోయిన విషయాన్ని తెలియజేశారు. సురేంద్ర కోలి స్వస్థలం.. అల్మోరాలోని భిక్యాసేన్‌లో ఉన్న మంగ్రుఖల్ గ్రామం. టీ స్టాల్లో పోలీసులకు ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదు. విచారణ, పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాతే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసు అధికారులు తెలిపారు.
2025లో సుప్రీంకోర్టు కోలిని అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా విడుదల చేసింది. నిఠారి హత్యలతో కోలికి సంబంధం ఉందనే ఆరోపణలతో అతనిని అరెస్ట్ చేశారు. సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత దోషిగా నిర్ధారించారు. అయితే.. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు అతడిని అనేక కేసుల నుంచి నిర్దోషిగా విడుదల చేసింది.
జూలై 2025లో, నిఠారి హత్యలకు సంబంధించిన 12 కేసులలో అతని నిర్దోషిత్వాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. నవంబర్ 2025లో.. సుప్రీంకోర్టు చివరిగా పెండింగ్‌లో ఉన్న కేసులో కూడా అతని దోషిత్వాన్ని రద్దు చేసి, అతడిని నిర్దోషిగా విడుదల చేయాలని ఆదేశించింది.
ALSO READ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు
నిఠారీ సీరియల్ కిల్లింగ్స్కేసు ఆధారంగా సెక్టార్–36 అనే సినిమా కూడా తీశారు. ఈ ఘటన 2005లో నోయిడాలో జరిగింది. అప్పట్లో ఈ కేసు ఒక సంచలనం. ఢిల్లీలోని సెక్టార్ 36 ప్రాంతంలో కేర్‌టేకర్‌గా పనిచేసే ప్రేమ్ (విక్రాంత్ మాస్సే) ఒక అమ్మాయి శరీరాన్ని క్రూరంగా కోస్తున్న సీన్తో సినిమా మొదలవుతుంది. ప్రేమ్ బయటికి ఒక ఫ్యామిలీ మ్యాన్లా కనిపిస్తుంటాడు. బస్సీ అనే వృద్ధుడి దగ్గర కేర్‌టేకర్‌గా పనిచేస్తుంటాడు.
ఢిల్లీలో ఎక్కువ జనాభా ఉండే మురికివాడ రాజీవ్ కాలనీ నుంచి అనేక మంది పిల్లల్ని ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్‌చేసి చంపేస్తుంటాడు. ఆ తర్వాత అవయవాలను అక్రమ రవాణా చేస్తుంటాడు. ఇదంతా చేసేది అతని యజమాని కోసమే. అయితే.. ఆ తప్పిపోయిన పిల్లల జాడ కనిపెట్టేందుకు ఇన్‌స్పెక్టర్ రామ్ చరణ్ పాండే (దీపక్ డోబ్రియాల్) పనిచేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కిల్లర్ లక్ష్యం ఏంటి? ఎలా పట్టుబడ్డాడు? తెలియాలంటే సెక్టార్–36 సినిమా చూడాల్సిందే.