July 12, 2026

Yuzvendra Chahal: “మందు మానేశా.. ఈసారి 150% ఎఫర్ట్స్ పక్కా”.. ఐపీఎల్‌కు ముందు చాహల్ సంచలన ప్రకటన!

Yuzvendra Chahal: “మందు మానేశా.. ఈసారి 150% ఎఫర్ట్స్ పక్కా”.. ఐపీఎల్‌కు ముందు చాహల్ సంచలన ప్రకటన!
Reading Time: 2 minutes
Yuzvendra Chahal Fitness Transformation Ipl 2026 No Alcohol Comeback

Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్.. ఈ పేరు వింటేనే టీమిండియా ప్లేయర్లకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ప్లేయర్లకే కాదు.. అభిమానులు సైతం చాహల్ ఫన్నీ స్పంట్స్‌, చిలిపి చేష్టలను ఎంతో ఇష్టపడేవాళ్లు. మైదానంలో వికెట్లు తీస్తూ సందడి చేసే చాహల్ చాలా కాలంగా కనిపించ లేదు. ఇక ఈ ఐపీఎల్ 2026తో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌ కోసం తన జీవన విధానంలో అనేక మార్పులు చేసుకున్నట్లు చాహల్ తెలిపాడు. సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న చాహల్, గత ఆరు నెలలుగా తాను మద్యానికి (Alcohol) పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. 35 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించి, జట్టు కోసం తన శాయశక్తులా కృషి చేయాలనే పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది.

READ MORE: Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన

వాస్తవానికి.. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మార్చి 2025లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ, వ్యక్తిగత కారణాలు, కెరీర్ విభేదాలు మరియు ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోవడం వంటి కారణాల వల్ల (compatibility issues) విడిపోయారు. ఈ విడాకుల అనంతరం చాహల్ మద్యానికి బానిసగా మారాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో కొన్ని వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. అయితే.. తాజాగా పాడ్‌కాస్ట్‌లో చాహల్ మాట్లాడుతూ.. “నేను మందు(ఆల్కహాల్) తాగడం మానేశాను. గత 6 నెలలుగా ఆల్కహాల్ తాగడం లేదు. ఇప్పటికే నా ఏజ్ 35. ఇక ముందు నేను యాక్టి్వ్‌గా పని చేయాలనుకుంటున్నాను. నా టీమ్ కోసం 150 శాతం ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నా. గత సీజన్‌లో కేకేఆర్‌తో ఓ మ్యాచ్ అనంతరం.. నాకు ఇంజూరీ అయ్యింది. అందుకే సెమీస్‌లో మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాను. అప్పుడు చాలా బాధ పడ్డాను. ఈ సారి అలా జరగదు. ఓ సీనియర్ ప్లేయర్‌గా నా ప్రదర్శన ఉంటుంది.” అని చాహల్ వివరించాడు. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో కేవలం 6 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. ఆ ఓటమి తనను ఎంతో కలిచివేసిందని చాహల్ ఆవేదన వ్యక్తం చేశాు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ అందుబాటులో లేకపోవడం తమ జట్టు విజయావకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. జాన్సెన్ ఉండి ఉంటే కచ్చితంగా టైటిల్ గెలిచేవాళ్లమని చెప్పాడు.