July 12, 2026

1.7 కోట్లకు పైగా ఐటీఆర్స్ దాఖలు.. ఈ నెలాఖరు వరకు గడువు

1.7 కోట్లకు పైగా ఐటీఆర్స్ దాఖలు.. ఈ నెలాఖరు వరకు గడువు
Reading Time: < 1 minute

1.7 కోట్లకు పైగా ఐటీఆర్స్ దాఖలు.. ఈ నెలాఖరు వరకు గడువు

Caption of Image.

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2025-26కు గానూ ఇప్పటివరకు 1.7 కోట్లకు పైగా ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ రిటర్న్స్‌‌‌‌‌‌‌‌ (ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫారమ్‌‌‌‌‌‌‌‌లను ఫైల్ చేయడానికి జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. శుక్రవారం ఒక్కరోజే 10 లక్షలకు పైగా ఐటీఆర్‌‌‌‌‌‌‌‌లు దాఖలు కావడం విశేషం.

ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1: చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారులు  ఐటీఆర్-1 (సహజ్) ఫారమ్‌‌‌‌‌‌‌‌ను ఫైల్ చేయాలి. ఏడాదికి రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఈ ఫారమ్‌‌‌‌‌‌‌‌ను దాఖలు చేయాలి. జీతం లేదా పెన్షన్ ఆదాయం పొందినా, బ్యాంక్ సేవింగ్స్‌‌‌‌‌‌‌‌పై వడ్డీల ద్వారా ఆదాయం పొందినా,  ఒకే ఇంటిపై అద్దెల ద్వారా ఆదాయం పొందినా, ఏడాదికి రూ. 5 వేల లోపు వ్యవసాయ ఆదాయం ఉన్నా ఈ ఫారమ్‌‌‌‌‌‌‌‌ను  దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్-2: వ్యాపారం లేదా వృత్తి  ద్వారా కాకుండా, క్యాపిటల్ గెయిన్స్ (పెట్టుబడి లాభాలు), ఇతర వనరుల ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు,  హిందూ అన్‌‌‌‌‌‌‌‌డివైడెడ్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌ ఈ ఫారమ్‌‌‌‌‌‌‌‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.  జులై 31 లోపు  ఐటీఆర్‌‌‌‌‌‌‌‌లను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

►ALSO READ | LV ప్రసాద్ హాస్పిటల్కు గుర్తింపు

©️ VIL Media Pvt Ltd.