LV ప్రసాద్ హాస్పిటల్కు గుర్తింపుCaption of Image.
హైదరాబాద్, వెలుగు: కంటి వైద్యసేవలు అందించే హైదరాబాద్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 వరకు తన ‘కోలాబరేటింగ్ సెంటర్’గా తిరిగి ఎంపిక చేసింది. 2001 నుంచి వరుసగా ఈ హోదాను దక్కించుకోవడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యుహెచ్ఓ గుర్తించిన 11 అత్యుత్తమ కంటి సంరక్షణ బ్రాండ్లలో ఒకటిగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నామని హాస్పిటల్ తెలిపింది. దీంతో గ్లోబల్‌గా తమ బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుందని పేర్కొంది.