July 12, 2026

అసెంబ్లీలో మంత్రి పొన్నం మట్టి పాత్రల పంపిణీ

అసెంబ్లీలో మంత్రి పొన్నం మట్టి పాత్రల పంపిణీ
Reading Time: < 1 minute

అసెంబ్లీలో మంత్రి పొన్నం మట్టి పాత్రల పంపిణీ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఉగాది పండుగ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, కుల వృత్తుల ప్రోత్సాహమే లక్ష్యంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అసెంబ్లీలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. శాసనసభ వేదికగా స్పీకర్, మండలి చైర్మన్ సహా తోటి మంత్రులకు మట్టి పాత్రలను అందజేసి అందరి దృష్టిని ఆకర్షించారు. 

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అసెంబ్లీలో స్వయంగా కలిసి వారికి మట్టి పాత్రలను అందజేశారు.

©️ VIL Media Pvt Ltd.