Reading Time: < 1 minute
Sanju Samson Reveals Struggles During T20 World Cup 2026

Sanju Samson: భారత్‌ టీ20 వరల్డ్ కప్ 2026ను కైవసం చేసుకుంది. మూడు ట్రోఫీలు సాధించిన ఏకైక టీమ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ చరిత్ర వెనుక ప్లేయర్స్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.. టీమిండియాలోని కొందరు ప్లేయర్స్ అనేక విమర్శలకు గురై చివరకు సత్తా చాటారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్‌ సంజూ శామ్సన్. తాజాగా సంజూ తన ప్రయాణానికి సంబంధించిన కీలక విషయాలను, జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’ బయట పెట్టాడు. టోర్నీ ఆరంభంలో జట్టులో స్థానం కోల్పోవడంతో మానసికంగా ఎంతో కుంగిపోయినట్లు వెల్లడించాడు. వాస్తవానికి.. న్యూజిలాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో రాణించకపోవడంతో సంజూను పక్కన పెట్టారు. ప్రపంచకప్ తొలి దశలో సంజూ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోల్పోయాడు. ఆ సమయంలో తన సొంత సహచరులతోనే పోటీ పడాల్సి రావడం తనకు ఇబ్బందిగా అనిపించిందని చెప్పాడు.

READ MORE: RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు

సంజూ మాట్లాడుతూ.. వరల్డ్ కప్పు గెలవాలనేది నా డ్రీమ్. కానీ మొదట్లో ఫైనల్‌ టీమ్‌లో నా పేరు లేకపోవడంతో నేను ఎంతగానో బాధ పడ్డాను. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోవడం నన్ను కలచివేసింది. కొన్ని రోజుల విరామం తర్వాత సూపర్ 8 దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నాకు అవకాశం దక్కింది. ఆ సమయంలో మేనేజ్‌మెంట్‌ నాపై ఉంచిన నమ్మకం నా ఆలోచన దృక్పథాన్ని మార్చేసింది. జట్టు కోసం ఆడాలనే నా తపన రెట్టింపు అయ్యింది. ఆ పట్టుదలతో వెస్టిండీస్‌పై 97, సెమీస్, ఫైనల్‌లో 89 చొప్పున పరుగు చేశాను.” అని చెప్పాడు. ఇక సంజూ, అభిషేక్ మధ్య ఉన్న మైదానంలోని సమన్వయం గురించి సంజూ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఇద్దరి మధ్య ‘పంజాబీ ఫ్రెండ్‌షిప్’ నడుస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. అభిషేక్ చాలా ధైర్యవంతుడన్నాడు. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు.

READ MORE: OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర