July 8, 2026

Watch: ఇంట్లో కోతుల కిష్కిందకాండ.. బయట వీధి కుక్కల స్వైర విహారం! నగర జనం బెంబేలు

Watch: ఇంట్లో కోతుల కిష్కిందకాండ.. బయట వీధి కుక్కల స్వైర విహారం! నగర జనం బెంబేలు
Reading Time: < 1 minute
Watch: ఇంట్లో కోతుల కిష్కిందకాండ.. బయట వీధి కుక్కల స్వైర విహారం! నగర జనం బెంబేలు

వరంగల్ నగరంలో ఒకవైపు కోతులు.. మరోవైపు కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. కుక్కలు మీద పడి రక్కీ ప్రాణాలకు ముప్పు తీస్తుంటే, కోతులు ఇల్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.. తాజాగా కాపువాడ సమీపంలోని ఓ ఇంట్లో కోతులు బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. కోతులు – కుక్కల బెడద నుండి ప్రాణాలు కాపాడాలంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

వానర సేనల ఆకలి దాడులు ఒకవైపు.. వీధి కుక్కల స్వైర విహారం మరోవైపు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.. పిల్లలు, పెద్దలన్న తేడా లేకుండా రక్కి గాయపరుస్తున్నాయి.. సగటున రోజుకు పది మంది ఆసుపత్రి పాలవుతున్నారు.. వీధి కుక్కల బెడదతో ప్రజలు గజగజ వనికి పోతున్నారు..

మరోవైపు వానర సేనలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఏకంగా ఇళ్లలోకి చొరబడి మూకుమ్మడిగా దాడులు చేస్తున్నాయి..ఇల్లంతా కిష్కిందకాండ చేస్తున్నాయి. ఇళ్లలోని తినుబండారాలు, నిత్యవసర వస్తువులు చిందరవందర చేసేస్తున్నాయి.. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీద పడి రక్కి గాయపరుస్తున్నాయి.. కోతుల గుంపు స్వైర విహారం చూసి జనం హడలెత్తిపోతున్నారు..

వీడియో ఇక్కడ చూడండి..

తాజాగా కాపువాడ ప్రాంతంలోని ఓ ఇంట్లో కోతుల గుంపు బీభత్సం సృష్టించిన దృశ్యాలు జనం హడలెత్తిపోయేలా చేస్తున్నాయి. కోతుల బెడదనుండి తమకు విముక్తి కల్పించండి మొర్రో అని జనం మొత్తుకుంటున్నారు.. ఇంట్లో ఉంటే కోతులతో భయం.. బయటకు వెళితే వీధికుక్కల బెడద.. కోతులు – కుక్కలతో ప్రజల ప్రాణాలకు భద్రత కరువైందని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..