July 8, 2026

ఫిఫా వరల్డ్ కప్‌ నుంచి పోర్చుగల్ ఔట్.. స్టేడియంలో బోరున విలపించిన రొనాల్డో

ఫిఫా వరల్డ్ కప్‌ నుంచి పోర్చుగల్ ఔట్.. స్టేడియంలో బోరున విలపించిన రొనాల్డో
Reading Time: < 1 minute

ఫిఫా వరల్డ్ కప్‌ నుంచి పోర్చుగల్ ఔట్.. స్టేడియంలో బోరున విలపించిన రొనాల్డో

Caption of Image.

ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత బలమైన జట్లలో ఒకటైన పోర్చుగల్ ప్రయాణం విషాదకరంగా ముగిసింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా మంగళవారం (జులై 7) హోరాహోరీగా జరిగిన పోరులో పోర్చుగల్‎పై 1-0 తేడాతో స్పెయిన్‌‎ విజయం సాధించింది. సెకండాఫ్ అదనపు సమయంలో ప్రత్యామ్నాయ ఆటగాడు మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్‌తో స్పెయిన్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 

ఈ ఓటమితో పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్‎కు దూసుకెళ్లింది. దీంతో పోర్చుగల్‎కు అందని ద్రాక్షగా మిగిలిన ఫిఫా వరల్డ్ కప్ అందించాలన్న ఆ దేశ దిగ్గజ ఆటగాడు క్రిస్ట్రియానో రొనాల్డో చిరకాల వాంఛ నేరవేరలేదు. ఎందుకంటే.. ఈ టోర్నీకి ముందే తనకు ఇదే వరల్డ్ కప్ అని రొనాల్డో ప్రకటించిన విషయం తెలిసిందే. సో.. నెక్ట్స్ ఫిఫా వరల్డ్ కప్‎లో ఈ దిగ్గజ ఆటగాడిని చూడలేం. 

స్పెయిన్‎పై ఓటమి అనంతరం తన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాననే బాధతో రొనాల్డో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ఆటతో ఫుట్‎బాల్‎లో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రొనాల్డో.. తన చిరకాల వాంఛ నేరవేరకుండానే కన్నీళ్లతో అంతర్జాతీయ కెరీర్‎కు ముగింపు పలకడం సగటు ఫుట్‎బాల్ అభిమానిని బాధించింది. 

©️ VIL Media Pvt Ltd.