Reading Time: < 1 minute

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై సస్పెన్స్.. క్లారిటీ ఇచ్చిన ఇరాన్ 

Caption of Image.

ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ విదేశాంగ  మంత్రి అబ్బాస్​ అరఘ్చి తోసిపుచ్చారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని అమెరికా వాదలను అరఘ్చీ తోసిపుచ్చారు. ఎంఎస్​ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఖమేనీ క్షేమంగానే ఉన్నారని.. ఆయన ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్య లేదు.. యుద్దంలో ఖమేనీ గాయపడ్డారనే వార్తలు అవాస్తవం అన్నారు. 

ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు తెలిసి మోజ్తాబా గాయపడ్డాడు. ఎదో ఒక రూపంలో బ్రతికే ఉన్నాడని అనుకుంటున్నాను అని అన్నారు. అయితే మొజాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డట్లు, టెహ్రాన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతను ఓ కాలు పూర్తిగా కోల్పోయాడని, లివర్ డ్యామేజ్ జరిగిందని ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతకుముందు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ కూడా మోజ్తాబా ఖమేనీ గాయపడ్డారని చెప్పారు. 

మరోవైపు హార్ముజ్​ జలసంధి మూసివేతపై కూడా క్లారిటీ ఇచ్చారు.  అమెరికా, దాని మిత్రదేశాలకు మాత్రమే జలసంధి గుండా అనుమతి లేదు..  మిగతా దేశాల నౌకలు హార్ముజ్​ గుండా వెళ్లేందుకు అనుమతి  ఉందని అర ఘ్చీ చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.