Reading Time: 2 minutes
Ravichandran Ashwin Backs Abhishek Sharma Hits Back At Mohammad Amir T20 World Cup 2026

Ravichandran Ashwin: అభిషేక్ శర్మ.. నిన్న జరిగిన జింబాబ్వే మ్యాచ్‌కు ముందు ఈ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అభిషేక్‌ను ప్లేయింగ్ లెవెన్ నుంచి తొలించాలని గట్టిగానే వాదనలు వినిపించాయి. టీ20 వరల్డ్‌కప్ 2026లో అభిషేక్ శర్మ ఆటతీరుపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ (Mohammad Amir) తీవ్రంగా వ్యాఖ్యానించాడు. గ్రూప్ దశలో అభిషేక్ వరుసగా విఫలమవుతుండగా, “అతనికి డిఫెన్సివ్ గేర్ ఏదీ లేదు.. కేవలం స్లోగర్ మాత్రమే” అంటూ అమీర్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రంగా స్పందించారు. అయితే.. తాజాగా స్పిన్నర్ అశ్విన్ ఘాటుగా సమాధానమిచ్చాడు. తన యూట్యూబ్ ఛానెల్ ‘Ash Ki Baat’లో మాట్లాడిన అశ్విన్.. అభిషేక్ శర్మ యువరాజ్‌ కంటే మెరుగ్గానే ఆడుతున్నాడ చెప్పాడు. “అభిషేక్ స్లోగర్ కాదు. ప్రస్తుతం క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్ స్వింగ్స్‌లో ఒకడు. అతని మెంటర్ యువరాజ్ సింగ్. నిజం చెప్పాలంటే యూవీ కంటే కూడా మంచి బ్యాట్ స్వింగ్ అభిషేక్‌కి ఉంది. అభిషేక్ బంతిని బాదితే చాలా దూరం వెళ్తుంది. అందుకే కొందరికి అభి స్లోగర్‌లా అనిపిస్తాడు. ఇది ముమ్మాటికీ తప్పుడు వ్యాఖ్య” అని స్పష్టం చేశాడు. అశ్విన్ మరో కీలక విషయాన్ని వెల్లడించాడు. అభిషేక్ పవర్‌పై కాకుండా టైమింగ్‌పై దృష్టి పెట్టాలి. “అతను ప్రతి షాట్‌లో శక్తి పెట్టాల్సిన అవసరం లేదు. సరిగ్గా టైమ్ చేస్తే చాలు, బంతి తన పని తాను చేస్తుంది,” అని సూచించాడు. బ్యాటింగ్ కోచ్‌లు సైతం అభికి అదే చెప్పాలని సూచించాడు.

READ MORE: Rinku Singh 4 Bad Days: రింకూ సింగ్ జీవితంలో ఆ నాలుగు రోజులు.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పెను పరీక్ష!

ఇక.. గ్రూప్ స్టేజ్‌లో అభిషేక్ పరిస్థితి నిజంగానే క్లిష్టంగా మారింది. యూఎస్‌ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై డక్స్, అలాగే సూపర్ 8లో దక్షిణాఫ్రికాపై కేవలం 15 పరుగులు చేయడంతో ఫామ్‌పై సందేహాలు వ్యక్త మయ్యాయి. మధ్యలో కడుపు ఇన్‌ఫెక్షన్ కారణంగా నమీబియా మ్యాచ్ మిస్ కావాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందడంతో పాటు కొంత బరువు సైతం తగ్గాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనిపై వచ్చిన విమర్శలు మరింత ఒత్తిడి సృష్టించాయి. అయితే జింబాబ్వేపై మ్యాచ్‌లో 30 బంతుల్లో 55 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అభిషేక్ గట్టిగా సమాధానం ఇచ్చాడు.

READ MORE: New Rules for 1st March: మార్చి 1 నుంచి వచ్చే మార్పులు ఇవే.. వంటగది నుండి ప్రయాణాల వరకు ప్రభావం!