Reading Time: < 1 minute
Fake Ed Officials Arrested In Delhi

దేశ రాజధాని ఢిల్లీలో వింతైన సంఘటన జరిగింది. నకిలీ ఈడీ అధికారులుగా నటిస్తూ ఇల్లును కొల్లగొట్టారు. తాజాగా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Supreme court vs NCERT: న్యాయవ్యవస్థపై తప్పుడు ముద్ర వేసి విచారమా? ఎన్‌సీఈఆర్టీపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో ఒక ఇంటి పనిమనిషి.. యజమాని ఇంటినే దోచుకోవాలని పన్నాగం పన్నింది. అంతే ‘ స్పెషల్ 26’ సినిమాలో మాదిరిగా స్నేహితులతో కలిసి దోపిడీకి ప్రణాళిక రచించింది. ఇంట్లో గుట్టంతా స్నేహితులకు తెలియజేసింది. ఇంకేముంది పోలీస్ యూనిఫామ్‌లు ధరించి ఇంటి లోపలికి ప్రవేశించి ఖరీదైన గృహోపకరణాలు, నగదు దోచుకున్నారు. దాదాపు రూ.4 లక్షల నగదు. విలువైన గడియారాలు పట్టుకుపోయారు.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు 350 సీసీకెమెరాలను జల్లెడ పట్టారు. మొత్తానికి నిందితుల కదిలికలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి నగదు, ఖరీదైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పనిమనిషే దీనికంతటికి కుట్ర పన్నినట్లుగా పోలీసులు చెప్పారు.