
టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన సూపర్8 సమరంలో ఇంగ్లండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ గ్రూప్2 నుంచి సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై కూడా ఇంగ్లీష్ టీమ్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్ (63), బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ (23) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హ్యారీ చిరస్మరణీయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ 51 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. విల్ జాక్స్ (28), కరన్ (16) తమవంతు పాత్ర పోషించారు.