July 6, 2026

Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!

Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
Reading Time: 2 minutes
Akriti Agarwals Cryptic Post Sparks Prithvi Shaw Rumours Every Rumour Is True

Prithvi Shaw’s Fiancee Akriti Agarwal Alleged Cryptic Post Viral: భారత క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పృథ్వీ షాకు కాబోయే భార్య, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాను చాలాసార్లు మోసపోయా అని, కానీ ఒక్క మాట కూడా అనలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలోని ప్రతి రూమర్ నిజమే అంటూ అకృతి రాసుకొచ్చారు. అయితే అకృతి చేసిన పోస్టులలో ఎక్కడా పృథ్వీ షా పేరును ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆ వ్యాఖ్యలు షాను ఉద్దేశించే చేసినవని సోషల్ మీడియాలో అభిమానులు చర్చిస్తున్నారు.

ప్రతి రూమర్ నిజమే:

‘నన్ను చాలా సార్లు మోసం చేశారు. అయినా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడితో జీవితంలో ముందడుగు వేసిన తర్వాత ఇలా జరుగుతుందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అని అకృతి అగర్వాల్ ఓ పోస్టులో పేర్కొంది. మరో పోస్టులో ‘అన్నీ నిజమే. అతడి గురించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి రూమర్ వాస్తవం’ అని రాసుకొచ్చింది. అయితే ఈ రేండు పోస్టులు ప్రస్తుతం అకృతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కనిపించడం లేదు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అకృతి:

ఈ పోస్టులు నెట్టింట వైరల్ అయినప్పటికీ.. పృథ్వీ షా లేదా అకృతి అగర్వాల్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అలాగే అకృతి ఇప్పటికీ పృథ్వీ షాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండగా.. ఇద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు కూడా ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్నాయి. దీంతో ఈ ప్రచారంపై స్పష్టత రావాల్సి ఉంది. పృథ్వీ, అకృతి ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అకృతి ఒక నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందింది.

సాఫీగా సాగని క్రికెట్ కెరీర్:

మరోవైపు పృథ్వీ షా క్రికెట్ కెరీర్ గత కొంతకాలంగా సాఫీగా సాగడం లేదు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పటికీ అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఫిట్‌నెస్ సమస్యలు, పేలవమైన ఫామ్ కారణంగా జాతీయ జట్టుకు కూడా ఎప్పుడో దూరమయ్యాడు. అయితే ఇటీవల తన పునరాగమనంపై ఆశావహంగా స్పందించిన పృథ్వీ షా.. భారత్ తరఫున మళ్లీ ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. ‘భారత్‌కు తిరిగి ఆడాలని ఆలోచించకపోతే నేను క్రికెట్ ఎందుకు ఆడుతాను?. గత ఏడాది కొంత విరామం తీసుకుని మానసికంగా బలంగా మారాను. ఇప్పుడు సాధనను మూడు రెట్లు పెంచాను. ఈ విరామం వెనకడుగు కాదు.. మరింత బలంగా తిరిగి రావడానికి సరైన సమయం’ అని తెలిపాడు.