ఇవాళ (జులై 06) సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ.. అల్లు అర్జున్ వస్తారా..?

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి సోమవారం (జులై 06) నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిందితులు అందరూ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నేరుగా హాజరవుతారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
గత విచారణలో అల్లు అర్జున్ వర్చల్ గా హాజరయ్యారు. గత విచారణలో ఇద్దరు నిందితులు హాజరు కాకపోవడంతో విచారణ జులై 06కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. 23 మంది నిందితులు హాజరు అవుతేనే తదుపరి విచారణ ముందుకు సాగుతుందని తేల్చిచెప్పింది.
గత విచారణలో వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్.. కోర్టు ఆదేశాల మేరకు హాజరవుతారా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నందున.. ఈ సారి కూడా వర్చువల్ గానే హాజరవుతారనే చర్చ నడుస్తోంది.