July 6, 2026

LENIN: హిట్ కోసం వెంకన్నను దర్శించుకున్న అఖిల్.. రిలీజ్‌కు ముందు తిరుమలలో అక్కినేని ఫ్యామిలీ

LENIN: హిట్ కోసం వెంకన్నను దర్శించుకున్న అఖిల్.. రిలీజ్‌కు ముందు తిరుమలలో అక్కినేని ఫ్యామిలీ
Reading Time: < 1 minute

LENIN: హిట్ కోసం వెంకన్నను దర్శించుకున్న అఖిల్.. రిలీజ్‌కు ముందు తిరుమలలో అక్కినేని ఫ్యామిలీ

Caption of Image.

అక్కినేని అఖిల్ హీరోగా హిట్ కొట్టే టైం వచ్చింది. జులై 10న ‘లెనిన్’ (LENIN) థియేటర్లలోకి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.  భారీ రాయలసీమ బ్యాక్ డ్రాప్, అక్కినేని అఖిల్ నటనపై మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు వెంకన్న ఆశీస్సులు కూడా తోడవ్వాలని అక్కినేని కుటుంబం, ‘లెనిన్’ చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. 

ALSO READ :Pinaka Teaser: బ్లాక్ మ్యాజిక్, మిస్టరీ థ్రిల్తో పినాక’ టీజర్‌..

ఇవాళ సోమవారం ఉదయం (జులై 6న) అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట ‘లెనిన్’ చిత్రబృందం కూడా శ్రీవారి దర్శనం చేసుకుంది. ఈ సందర్భంగా హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నటుడు సునీల్, నిర్మాత నాగవంశీ తదితరులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో చిత్రబృందాన్ని సత్కరించారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోలు నాగ్, అఖిల్ కనిపించడంతో ఫ్యాన్స్ సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.