July 6, 2026

Rajendra Prasad: అవార్డులు అడిగితే ‘అది భిక్షే’.. పద్మశ్రీ తర్వాత రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Rajendra Prasad: అవార్డులు అడిగితే ‘అది భిక్షే’.. పద్మశ్రీ తర్వాత రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు
Reading Time: < 1 minute

Rajendra Prasad: అవార్డులు అడిగితే ‘అది భిక్షే’.. పద్మశ్రీ తర్వాత రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Caption of Image.

పద్మశ్రీ పురస్కారం అందుకున్న అనంతరం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన సన్మాన కార్యక్ర మంలో నటుడు రాజేంద్రప్రసాద్ భావోద్వేగంగా స్పందించారు. ‘ఇది కలా.. నిజమా.. నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం ఇవాళ జరిగింది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దాదాపు 48 ఏళ్ల సినీ ప్రయాణంలో నటుడిగా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు. పద్మశ్రీ ఆలస్యంగా వచ్చినా సరైన వ్యక్తికే వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు భావిస్తున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు. అవార్డుల కోసం తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని.. మనకు అర్హత ఉంటే ఆవార్డు వస్తుందని.. అడిగితే అది బిక్ష అవుతుందని’ రాజేంద్రప్రసాద్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తననట జీవితానికి జంధ్యాల, బాపు, వంశీ, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు, గొప్ప రచయితలే బలమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతగా మాత్రం తాను విజయవంతం కాలేదని రాజేంద్రప్రసాద్ స్వయంగా అంగీకరించారు.

►ALSO READ | Kalyan Ram: కళ్యాణ్ రామ్ డబుల్ ట్రీట్ అదిరింది.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ!

‘మేడమ్’, ‘రాంబంటు’ చిత్రాల తర్వాత నిర్మాతగా కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే నటుడిగా మాత్రం ఎక్కడా రాజీపడనని, కొత్త తరానికి చెందిన దర్శకులు తన కోసం మంచి పాత్రలు రాస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.