July 6, 2026

Akkineni Akhil: మీ ఇంట్లో ఒక‌డిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!

Akkineni Akhil:  మీ ఇంట్లో ఒక‌డిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
Reading Time: < 1 minute
Akhil Akkineni On Lenin I Wanted To Become A Part Of Your Family At Pre Release Event

Akkineni Akhil: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్స్ గా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించిన చిత్రం ‘లెనిన్’ (Lenin). ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో అక్కినేని వారసుడు అఖిల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘లెనిన్’ సినిమాతో నేను మీ ఇంటిలో ఒక‌డిని అవ్వాలని ప్రయత్నం చేశానని అన్నారు. సీమ బిడ్డ ‘నందు’ నాకు అద్భుతమైన కథ చెప్పారని.. నా జర్నీ, నా పెయిన్ అంతా కూడా ఈ కథలోనే కనిపించిందని చెప్పుకొచ్చారు. అందుకే నేను వెంటనే సినిమాకు ఓకే చెప్పానన్నారు. వంశీ ఒక్కడే ఈ సినిమాను చేయాలని అనుకున్నాడు.. కానీ, కథ విన్నాక ఇద్దరికీ ఓ పాజిటివ్ వైబ్ వచ్చి నాన్నకి చెప్పి.. అందరం కలిసి పని చేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

లియోన్, నవీన్, తమన్ ఇలా అందరూ మా సినిమా కోసం చాలా కష్టపడ్డారని.. భారతిగా భాగ్యశ్రీ బోర్సె చాలా కష్టపడిందని చెప్పుకొచ్చాడు. బ్రహ్మాజీ, సునీల్, శివాజీ ఇలా మేమంతా కలిసి ఓ కుటుంబంలా సినిమా కోసం కష్టపడ్డామని.. నేను ‘లెనిన్’ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడానని అంటూనే.. జూలై 10న సినిమానే మాట్లాడుతుందని సినిమాపై ధీమా వ్యక్తం చేసారు. సినిమా విడుదల తర్వాత ఆడియెన్స్ నుంచి రియాక్షన్స్ వచ్చిన తరువాతే నేను సినిమా గురించి మాట్లాడతానని అన్నారు.