July 6, 2026

ఫిఫా వరల్డ్ కప్: వరసగా నాలుగోసారి క్వార్టర్స్లోకి ఫ్రాన్స్.. పరాగ్వేపై 1-0తో విజయం

ఫిఫా వరల్డ్ కప్: వరసగా నాలుగోసారి క్వార్టర్స్లోకి ఫ్రాన్స్..  పరాగ్వేపై 1-0తో విజయం
Reading Time: < 1 minute

ఫిఫా వరల్డ్ కప్: వరసగా నాలుగోసారి క్వార్టర్స్లోకి ఫ్రాన్స్.. పరాగ్వేపై 1-0తో విజయం

Caption of Image.

ఫిలడెల్ఫియా: ప్లేయర్ల మాధ్య వాగ్వాదాలు, చివరి వరకు తీవ్ర ఉత్కంఠగా సాగిన ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌ సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ పోరులో 1–0తో పరాగ్వేపై గెలిచింది. దాంతో వరుసగా నాలుగోసారి క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ స్ట్రయికర్‌‌‌‌ కిలియన్‌‌‌‌ ఎంబాపె (70వ ని) పెనాల్టీ కార్నర్‌‌‌‌ను గోల్‌‌‌‌గా మలిచాడు.

మ్యాచ్‌‌‌‌ ఆరంభం నుంచి పరాగ్వే ప్లేయర్లు ఎంబాపెపై మైండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ను మొదలుపెట్టారు. పదే పదే ఫౌల్స్‌‌‌‌ చేస్తూ అతని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఎంబాపె సహనం కోల్పోలేదు. చిరునవ్వుతోనే దీటుగా సమాధానమిచ్చాడు. రెండు జట్ల రక్షణ శ్రేణి బలంగా పోరాడటంతో తొలి హాఫ్‌‌‌‌లో గోల్స్‌‌‌‌ నమోదు కాలేదు.

సెకండాఫ్‌‌‌‌లోనూ ఇరుజట్ల ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. చివరకు 70వ నిమిషంలో పరాగ్వే ప్లేయర్‌‌‌‌ డియెగో గోమెజ్‌‌‌‌ చేసిన ఫౌల్‌‌‌‌ను వీడియో అసిస్టెంట్‌‌‌‌ రిఫరీ పెనాల్టీగా ప్రకటించాడు. ఈ అవకాశాన్ని ఎంబాపె సూపర్‌‌‌‌ గోల్‌‌‌‌గా మలిచాడు. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ల్లో ఆడిన 19వ మ్యాచ్‌‌‌‌ల్లో ఎంబాపెకు ఇది 19వ గోల్‌‌‌‌ కావడం విశేషం. అర్జెంటీనా స్టార్‌‌‌‌ మెస్సీ కంటే ఒక్క గోల్‌‌‌‌ తక్కువగా ఉన్నాడు. ఓవరాల్‌‌‌‌గా ఈ టోర్నీలో ఎంబాపె, మెస్సీ చెరో ఏడు గోల్స్‌‌‌‌తో సమంగా కొనసాగుతున్నారు.

ఆట ముగిసిన తర్వాత పరాగ్వే గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ ఓర్లాండ్‌‌‌‌ గిల్‌‌‌‌ షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇవ్వడానికి చేయి చాచగా, ఎంబాపె పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో అగ్రహానికి గురైన గిల్‌‌‌‌.. బాల్‌‌‌‌ను ఎంబాపె వీపు పైకి బలంగా విసిరాడు. గత టోర్నీ రన్నరప్‌‌‌‌ అయిన ఫ్రాన్స్‌‌‌‌.. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌ల్లోనూ గెలవడం విశేషం. 

©️ VIL Media Pvt Ltd.