Reading Time: < 1 minute

దేశవ్యాప్తంగా ..58 ఇంజినీరింగ్ కాలేజీల మూసివేత

Caption of Image.
  •     ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లోనే అత్యధికం
  •     తెలంగాణలో 4 కాలేజీలు క్లోజ్!​
  •     950కి పైగా కోర్సులు రద్దు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2025–-26 విద్యాసంవత్సరానికి 58 ఇంజినీరింగ్, సాంకేతిక కళాశాలలను క్రమపద్ధతిలో మూసివేస్తున్నట్లు (ప్రోగ్రెసివ్ క్లోజర్) అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. విద్యార్థుల చేరికలు తగ్గడం, అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘ప్రోగ్రెసివ్ క్లోజర్’ కింద ఈ ఏడాది నుంచి కొత్త అడ్మిషన్లను నిలిపివేస్తారు. అయితే, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు తమ డిగ్రీలను పూర్తి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

మూతపడిన వాటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో 12 చొప్పున ఉండగా, తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్‌‌లో 3 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 3 ప్రభుత్వ ఎయిడెడ్ కాగా, మిగిలినవి ప్రైవేట్ విద్యాసంస్థలు. వీటితోపాటు దేశవ్యాప్తంగా డిమాండ్ లేని 950కి పైగా సాంకేతిక కోర్సులను కూడా రద్దు చేసినట్లు ఏఐసీటీఈ వెల్లడించింది. సాంకేతిక విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.