వందేళ్ల ఆరోగ్యానికి, యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన సీక్రెట్ రెసిపీ ఇదే.. జోరు వానల్లో మీరు దీనిని తింటే రోగ నిరోధక శక్తి కూడా డబుల్ అవుతుంది. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
అమ్మమ్మల స్టైల్ రాగి పిట్టు రెసిపీకి కావలసిన పదార్థాలు : రెండు కప్పుల రాగి పిండి, అర కప్పు బియ్యప్పిండి, ఒక కప్పు తురిమిన కొబ్బరి, ఒక కప్పు బెల్లం పొడి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా ఉప్పు , రెండు కప్పుల నీరును తీసుకోవాలి. సరైన కొలతలతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో తప్పక చేయండి.
అమ్మమ్మల స్టైల్ రాగి పిట్టు రెసిపీ తయారీ విధానం : ముందుగా ఒక మీడియం సైజు గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా రాగి పిండి, బియ్యప్పిండి, కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు దీనిలో నీటిని పోస్తూ పిండిని చేతితోనే కలపాలి. అయితే, ఈ పిండి మరి ముద్దలాగా కాకుండా కలుపుకోవాలి.
అమ్మమ్మల స్టైల్ రాగి పిట్టు రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : మీరు ఈ పిండిని కలుపుకున్న తరవాత 15 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి. అయితే, దీని కోసం చిన్న ఇడ్లీ పాత్రలో ముందు కొంచం కొబ్బరి తురుము వేయాలి. ఆ తరువాత దీని మీద రాగి పిండి పొర, ఆ తర్వాత మళ్లీ కొబ్బరి పొడి వేసి పైన రాగి పిండి వేసి పొరలు పొరలుగా పొరలుగా వేసుకోవాలి.
మీరు ఈ రెసిపీని స్టీమ్లో 15 నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత బెల్లం పొడి, యాలకుల పొడి వేసి మిక్స్ చేసేలా దీనిని కలుపుకోవాలి. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




