Viral Video: ముసుగులేసుకుని దొంగతనానికి వచ్చారు.. లైట్లు ఆర్పిందేకు స్విచ్ నొక్కాడు.. సీన్ కట్ చేస్తే..

Funny Thieves Viral cctv Video: సమాజంలో దొంగతనాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ, కొన్నిసార్లు దొంగలు చేసే సిల్లీ తప్పులు తీవ్రమైన నేరాన్ని సైతం నవ్వులపాలు చేస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక నిజ జీవిత సంఘటన చూస్తే మీరు ఖచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు. లైట్లు ఆర్పేయబోయి పొరపాటున కాలింగ్ బెల్ నొక్కి ఇంటి యజమానులకు అడ్డంగా దొరికిపోయిన దొంగల నవ్వుల కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది.
అసలేం జరిగిందంటే..?
సాధారణంగా దొంగలు రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడే ముందు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ఘరానా దొంగలు కూడా సరిగ్గా అలాగే ప్లాన్ చేసుకున్నారు. ముఖానికి ముసుగులు ధరించి, నీలం రంగు జాకెట్ వేసుకుని, బైక్‌లు పార్క్ చేసి ఉన్న ఒక ఇరుకైన సందులోకి నెమ్మదిగా ప్రవేశించారు. అంతా బాగానే ఉంది కానీ, అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది.
చీకటిని ఆసరాగా చేసుకుని లోపలికి వెళ్లాలనే కంగారులో, అక్కడ ఉన్న విద్యుత్ లైట్లు ఆర్పేయబోయారు. అయితే, ఆ హడావిడిలో లైట్ల స్విచ్‌కు బదులుగా నేరుగా ఇంటి కాలింగ్ బెల్ నొక్కేశారు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా డోర్ బెల్ మోగడంతో లోపల నిద్రిస్తున్న ఇంటి సభ్యులు అప్రమత్తమయ్యారు.
కట్ చేస్తే.. సీన్ రివర్స్..!
घर में चोर चोरी करने आए थे लाइट बंद करने की जगह बेल डोर बजा दी
फिर क्या हुआ आप ही देख लीजिए pic.twitter.com/bbd7FPgvXJ
— Tapasya Deva (@tapasy_deva_401) July 5, 2026
డోర్ బెల్ మోగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఊహించని ఈ పరిణామానికి భయపడిపోయిన సదరు ముసుగు దొంగలు, వెనక్కి తిరిగి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
నెట్టింట నవ్వుల పూయించిన ట్వీట్..
ఈ హాస్యాస్పద సంఘటనకు సంబంధించిన పన్నెండు సెకన్ల సీసీటీవీ దృశ్యాలను ఒక నెటిజన్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే దాదాపు డెబ్బై రెండు వేల కంటే ఎక్కువ వీక్షణలను సొంతం చేసుకుని హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో దొంగలను విపరీతంగా ఆటాడుకుంటున్నారు. “వీరు ఖచ్చితంగా దొంగతనానికి కొత్త అనుకుంటా”, “పార్ట్ టైమ్ దొంగలు అంటే వీరేనేమో” అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..