Reading Time: 3 minutes
అమ్మ బాబోయ్.. ఒక్క రోజులో ఇంత మార్పా..? సోమవారం రాశిఫలాలు ఇక్కడ చూడండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. పని భారంతో ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగ స్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

 

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అదనపు బాధ్యతల నుంచి, పని ఒత్తిడి నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు ఆదాయం మీద శ్రద్ధ పెంచుతారు.  ప్రయాణాల వల్ల లాభాలు కలుగు తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల సమ స్య లలో పడే అవకాశం ఉంది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.

 

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో సహోద్యోగుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచ నాల్ని మించుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. అనుకున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది.

 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి కరువవుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.  ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది.  ముఖ్యమైన వ్యవ హారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా  గౌరవ మర్యాదలకు లోటుండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. అదనపు ఆదాయం, రాబడి బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు క్రమంగా అనుకూ లంగా మారతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీ లకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తి వివాదంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.

 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్నిముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు.  అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.

 

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. వ్యాపారంలో కొన్ని కష్టనష్టాల నుంచి బయ టపడతారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాల్ని సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదు.

 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి.  ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.  రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది.

 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవి తంలో తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదని పిస్తుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంతో  విహార యాత్రకు  ప్లాన్ చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

 

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. మీ సమర్థతను గుర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సామాన్య లాభాలు గడిస్తారు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక సమ స్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.  సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.  ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయా సలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది.

 

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారులు బాగానే లాభాలు గడిస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబసమేతంగా ఆలయాలను దర్శిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.  ఆస్తి వివాదాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో రావలసిన సొమ్ము వసూలవుతుంది.  తలపెట్టిన వ్యవహారాలు పూర్తి కాకపోవచ్చు.