July 6, 2026

చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!

చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
Reading Time: < 1 minute
Producer Venkat Anish Reddy Booked In Cheating Case Jubilee Hills Police Register Criminal Case

సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరో నిర్మాత రజిత్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్‌తో పాటు పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారు రజిత్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. అనీష్ రెడ్డి కోసం మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడి వద్ద నుంచి రూ.40 లక్షలు ఇప్పించినట్లు తెలిపారు. తనకు ఉన్న రుణాలు క్లియర్ అయిన వెంటనే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని అనీష్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.

అయితే.. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని, పైగా డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని రజిత్ రావు ఆరోపించారు. కోట్ల రూపాయల ఆర్థిక వ్యవహారంలో తనను మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు అనీష్ రెడ్డిపై సెక్షన్ 318(4) (మోసం), సెక్షన్ 351(2)తో పాటు ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.