NEET 2026 రీ-ఎగ్జామ్ విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. అందరికీ 8 బోనస్ మార్కులు..?

హైదరాబాద్, జులై 6: పేపర్ లీకేజీతో దేశ వ్యాప్తంగా సంచలనం రేగడంతో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన నీట్ 2026 పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ 21న నీట్-యూజీ రీ ఎగ్జాంను దేశ వ్యాప్తంగా మళ్లీ నిర్వహించారు. ఈసారి ఎలాంటి అవకతకలు చోటు చేసుకోకుండా పకడ్భందీగా కేంద్రం నీట్ పరీక్షను నిర్వహించింది. అయితే పరీక్షనైతే విజయవంతంగా నిర్వహించిందిగానీ.. ప్రశ్నాపత్రంలో మాత్రం కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల విడుదల చేసిన నీట్ ప్రాథమిక ఆన్సర్ కీలో ఈ తప్పిదాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రెండు ప్రశ్నలను ఎన్టీయే రద్దు చేసింది. నీట్ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో ఫిజిక్స్ ప్రశ్నపత్రంలో రెండు తప్పులు ఉన్నట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
Also Read: చిన్నప్పుడు పొట్టపగిలేలా నవ్వుకున్న ‘రెక్కల ఏనుగు’ గుర్తుందా..? 90’s కిడ్స్‌కి ఇష్టమైన కథ
ఈ రెండింటిలో ఒక ప్రశ్నకు సరైన సమాధానం లేకపోవడంతో, జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) దానిని తొలగించనుంది. దీంతో విద్యార్థులందరికీ నాలుగు బోనస్ మార్కులు లభించనున్నాయి. మరో ప్రశ్నకు ఆప్షన్లలో రెండు సమాధానాలు వచ్చాయి. దీంతో ఆ రెండింటినీ సరైనవిగా పరిగణిస్తారు. ప్రశ్నాపత్రంలో రెండు సమాధానాలు ఉన్న సదరు ప్రశ్నకు కూడా మార్కులు కలపాలని డిమాండ్ లు వస్తున్నప్పటికీ NTA గానీ, విద్యా మంత్రిత్వ శాఖ గానీ దీనిపై ఇంతవరకు స్పందించలేదు.
పరీక్షలో మొత్తం 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉండగా, ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయించారు. ఇందులో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, బయాలజీ నుంచి ఒక్కో విభాగానికి 45 ప్రశ్నల చొప్పున విభజించి.. మొత్తం 720 మార్కులకు పరీక్షను నిర్వహించారు. ఇందులో 40 ప్రశ్నకు ఆప్షన్ లలో సరైన సమాధానం ఇవ్వకపోవడంతో దానిని Drop చేస్తున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. వెర్నియర్ కాలిపర్స్ ప్రశ్నకు నాలుగు సమాధాన ఎంపికలు ఉన్నాయి. ఆ నాలుగూ తప్పు. సరైన సమాధానం 1.6 సెం.మీ. అని ఢిల్లీలోని విజనరీ మాస్టర్స్ డైరెక్టర్ హర్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.
Also Read: A, B, Cల్లో దొంగ వెళ్లిన దారేది? మీ తెలివికి సవాల్ విసిరే చిక్కుప్రశ్న
విద్యుదయస్కాంత తరంగాలపై ఉన్న ప్రశ్న మరొక పొరపాటు. సాధారణంగా ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉండాలి. కానీ 22వ ప్రశ్నకు 3, 4 అనే రెండు సమాధానాలూ సరైనవే. NTA పోర్టల్ ప్రకారం ఏ ఎంపికలూ సరైనవి కాకపోయినా, ఒక ప్రశ్న తప్పుగా ఉన్నా లేదా వదిలివేసినా, అభ్యర్థి ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, హాజరైన అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వవల్సి ఉంటుంది. అయితే దీనిపై ఇంత వరకూ ఎన్టీయే గానీ, విద్యాశాఖ గానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. తుది ఆన్సర్ కీ విడుదల నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.