
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అవుతోంది. ప్రజలు ఇండ్లనుంచి బయటికి రాలేని పరిస్థితి. రాబోయే ఐదు రోజులు కూడా భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.దీంతో సోమవారం(జూన్6) ముంబైలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. వివరాల్లోకి వెళితే..
భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. ముంబై సిటీలో 24 గంటల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. చాలా చోట్ల చెట్లు కూలడంతో కొందరు మృత్యువాత పడ్డారు. విమానాలు,రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాలు రద్దు చేశారు, మరికొన్ని దారి మళ్లించారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో సోమవారం (జూలై6) ముంబైనగరంలోని స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటికి రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలోని అన్ని స్కూల్స్,కాలేజీలు మూసివేయాలని బృహణ్ ముంబై కార్పొరేషన్ ప్రకటించింది. నగరంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ఇంకా తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగర పాలక సంస్థ తెలిపింది.అయితే, వాతావరణ హెచ్చరిక ఉన్నప్పటికీ ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని బీఎంసీ స్పష్టం చేసింది.
►ALSO READ | ఈ–20 పెట్రోల్పై తొలిసారి ధర్నా.. ఇంజిన్లు డ్యామేజ్.. మైలేజ్ పోతుందంటూ ఢిల్లీలో ఆందోళన