
కుటుంబ కలహాలతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన మంచాల పోలీస స్టేషన్ పరిధిలోని నోముల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సం బంధించిన వివరాలు మంచాల సిఐ మధు, స్థా నికులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. మంచాల మండల పరిధిలోని నోముల గ్రా మానికి చెందిన మాదరమోని బా బు (55), అమృత (50) దంపతులు లేబర్ పని చేస్తు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడికి వివాహం కాగా చిన్న కుమారుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. గత కొంతకాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు నచ్చజెప్పినప్పటికి అలాగే గొడవ పడుతుండేవాడు.
శివరాత్రి పండుగ రోజు మద్యం తాగి పెద్ద గొడవ చేసి అప్పటి నుంచి ఇంటిపై ఉన్న మరో గదిలో బాబు ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యాహ్నం ఇంటిపై నుంచి కిందికి వచ్చిన బాబు నిద్రిస్తున్న అమృతను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేసి, గొడ్డలి అక్కడే వదిలేసి పరారయ్యాడు. అదే సమయంలో ఇంట్లో గదిలో ఉన్న కోడలకు శబ్ధం రావడంతో తన భర్త నవీన్ కు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలానికి సిఐ మధు ఆధ్వర్యంలో వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.