Reading Time: < 1 minute
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా

‘ఆదర్శ కుటుంబం’ వాయిదా అఫీషియల్ అయిపోయింది.. అక్టోబర్ 9న రావాల్సిన సినిమా ఆగిపోయింది.. మరి ఈ సినిమా నిజంగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగానే వాయిదా పడిందా..? లేదంటే ఇంకేదైనా బలమైన కారణం ఉందా..? మరి ఆదర్శ కుటుంబం కొత్త డేట్ ఎప్పుడు..? అక్టోబర్ 30కి గానీ వచ్చిందంటే ఆ రోజు రాబోయే మూడు సినిమాల ఫ్యూచర్ ఏంటి..? ఆదర్శ కుటుంబం సినిమా వాయిదా పడింది.. దాని గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉన్న డిసిప్లిన్ అలాంటిదంటూ నాగవంశీ వేసిన సెటైర్లు హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు. ఈ సినిమా ఫస్ట్ కాపీతో పాటు ట్రైలర్ కూడా రెడీ కాలేదని ఆయన అసలు విషయం బయటపెట్టారు. ఈ టైమ్‌లో ఓవర్సీస్ సెన్సార్ పనులకు కూడా సమయం సరిపోదని, అందుకే కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే చెబుతామన్నారు. కేవలం అనుకున్న టైమ్‌కి రావాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో అక్టోబర్ 9న సినిమాను రిలీజ్ చేస్తే.. అది పక్కాగా సగం ప్రాడక్ట్ అవుతుందన్నారు నాగవంశీ. క్వాలిటీ ఏమాత్రం తగ్గినా సోషల్ మీడియాలో ఆడుకుంటారని.. ఆ భయం కూడా ఉంది కాబట్టే అర్జంట్‌గా సినిమాను తీసుకురావట్లేదని చెప్పారు. అందుకే మరో రెండు మూడు వారాల పాటు టైమ్ తీసుకుని పర్ఫెక్ట్ ఔట్‌పుట్‌‌తో వస్తామని నాగవంశీ ఫుల్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఒకవేళ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30కి వెళితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద క్లాష్ తప్పదు. ఆ రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్న అనీష్ ఇట్లు అర్జున, రోషన్ మేక ఏమో ఏమో ఇది, విశ్వక్ సేన్ కల్ట్ సినిమాలకు ఇది పెద్ద ముప్పు అనే చెప్పాలి. ఆదర్శ కుటుంబం లాంటి బడా ప్రాజెక్ట్ వస్తే ఆ యంగ్ హీరోల సినిమాలు వేరే డేట్ చూసుకోవాలి లేదంటే గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం

గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ

భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?

దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి

శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు