Reading Time: 2 minutes

వాళ్లు స్టూడెంట్లు.. సంఘవిద్రోహులు కాదు :బాంబే హైకోర్టు

Caption of Image.
  •     పరీక్షల్లో అక్రమాలుంటే ఆందోళన చేసే హక్కు ఉంది: బాంబే హైకోర్టు
  •     పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి నమ్మకం పునరుద్ధరించాలి
  •     పేపర్‌ లీక్‌లు, అక్రమాలపై దర్యాప్తు చేసి దోషులను గుర్తించాలని ఆదేశం

 
ముంబై: మహారాష్ట్ర పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ (ఎంపీఎస్సీ) పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్న స్టూడెంట్లు సంఘవిద్రోహులు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. పరీక్షల్లో ఏదైనా అక్రమం జరిగిందని భావిస్తే నిరసన తెలిపే హక్కు వారికి ఉందని పేర్కొంది. అయితే, ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నందున విద్యార్థులు ఆందోళనలు విరమించి చదువులపై దృష్టి పెట్టాలని సూచించింది. రాష్ట్రంలో ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌కు పుణె ప్రధాన సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందని, విద్యార్థులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే వారి సమస్యలు తీవ్రమైనవేనని కోర్టు అభిప్రాయపడింది.

70 వేల ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టండి..

పుణె వాసులు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌చంద్ర త్రిపాఠి, జస్టిస్‌‌‌‌‌‌‌‌ అద్వైత్‌‌‌‌‌‌‌‌ సేథ్నా ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని తెలిపింది. పరీక్షలపై విద్యార్థులు, ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎంపీఎస్సీ పరిధిలో 70 వేలకుపైగా ఖాళీలు ఉన్నందున వాటి భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఎలా భర్తీ చేస్తారో పూర్తి వివరాలను ‘బ్లాక్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ వైట్‌‌‌‌‌‌‌‌’లో మూడు వారాల్లో రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌తో సహా సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే పరీక్షల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీలపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను గుర్తించాలని పేర్కొంది.

రోడ్లపై కాకుండా నిర్ణీత చోటే నిరసన

విద్యార్థుల డిమాండ్లలో పరీక్ష ఫీజును రూ.100కు తగ్గించడం, అన్ని పరీక్షలను ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించడం వంటి వాటిని ప్రభుత్వం అంగీకరించిందని అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ మిలింద్‌‌‌‌‌‌‌‌ సాఠే కోర్టుకు తెలిపారు. ఎంపీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రాజీనామాపై గవర్నర్‌‌‌‌‌‌‌‌కు సిఫార్సు పంపామని చెప్పారు. ఆందోళనకారులపై ఇప్పటివరకు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లు నమోదు చేయకుండా పోలీసులు సంయమనం పాటించారని తెలిపారు. దీనిని కోర్టు అభినందించింది. అయితే, నిరసనలతో పుణె ప్రజలకు ఇబ్బంది కలగకూడదని స్పష్టం చేసింది. ఆందోళన కొనసాగించాలంటే అనుమతి తీసుకుని, అధికారులు సూచించే ప్రదేశంలోనే చేపట్టాలని సూచించింది. 
 

©️ VIL Media Pvt Ltd.