Reading Time: 2 minutes
Nana Patekar Dies At 75 Veteran Actor Passes Away In Goa

Bollywood Veteran Actor Nana Patekar Dies at 75: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన నానా పటేకర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గోవాలోని తన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితిలో కనిపించగా.. కుటుంబసభ్యులు వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు దాదాపు 45 నిమిషాలు సీపీఆర్ చేసినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. ఉదయం 5:20 గంటలకు నానా పటేకర్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 1951 జనవరి 1న జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. భారతీయ సినిమాల్లో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తెరపై ఆయన చూపించిన గంభీరమైన నటన, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘క్రాంతివీర్’, ‘పరిం దా’, ‘ప్రహార్’, ‘వెల్‌కమ్’, ‘నటసామ్రాట్’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో నానా పటేకర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హిందీతో పాటు మరాఠీ చిత్రాల్లోనూ అనేక విభిన్న పాత్రలు పోషించారు. 1988లో ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘సలామ్ బాంబే’లో నటించి మరింత గుర్తింపు పొందారు. 1989లో విడుదలైన ‘పరిం దా’ చిత్రంలో అద్భుతమైన నటనకు నానా పటేకర్ జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. సినిమాకు, కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగానూ నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. గంభీరమైన పాత్రల నుంచి కామెడీ వరకు విభిన్నమైన పాత్రలను తనదైన శైలిలో పండించిన ఆయనకు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు తన నటనతో సేవలందించిన నానా పటేకర్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ఆయన మరణవార్తతో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నానా పటేకర్ జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.