Reading Time: 2 minutes
Nana Patekar : వెంకటేశ్ సినిమా కోసం కోటిన్నర అడిగిన నానా పటేకర్.. ఆ నటుడికి దక్కిన లక్కీ ఛాన్స్.. దెబ్బకు జీవితం మారిపోయింది..

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతితో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. హిందీ, మరాఠీ చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. తన మార్క్ డైలాగ్ డెలివరీ, ఇంటెన్స్ యాక్టింగ్‌తో దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాను ఏలిన ఈ లెజెండరీ యాక్టర్ తుదిశ్వాస విడిచారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్, సాధించిన విజయాలను ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. సాధారణ రంగస్థల నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన నానా పటేకర్, ఎనభైల దశకంలో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తన డిఫరెంట్ వాయిస్, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్‌తో అప్పటి యాక్టింగ్ రూల్స్ మొత్తం మార్చేశారు. పరిందా, ప్రహార్, క్రాంతివీర్ లాంటి సినిమాలు ఆయనలోని నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.

ఇదిలా ఉంటే.. తెలుగులో వెంకటేశ్ నటించిన ఓ సినిమాలో క్రేజీ ఛాన్స్ మిస్సయ్యారు నానా పటేకర్. దీంతో ఆ మూవీతోనే మరో టాలీవుడ్ నటుడు లైఫ్ మారిపోయింది. ఆయన మరెవరో కాదు.. దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినీ కెరీర్‌కు రెండో ఇన్నింగ్స్ ఇచ్చిన ప్రేమించుకుందాం రా చిత్రం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ ప్రస్థానంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఊబి, పరిశ్రమను విడిచి ఐదేళ్ల పాటు దూరంగా ఉన్న రోజుల గురించి వివరించారు. ఈ కష్టకాలంలో తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ట్యూషన్లు చెప్పుకుంటూ, వేతనం లేకుండా తొమ్మిదేళ్లు ప్రభుత్వ ఉద్యోగిగా గడిపినట్లు తెలిపారు. సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న ఐదేళ్ల కాలంలో, ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు గారు తనను సంప్రదించినప్పటికీ, మళ్లీ ఇబ్బందుల్లో పడతానేమోనని భయంతో అవకాశాలను తిరస్కరించినట్లు జయప్రకాష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అప్పులు తీర్చడం కోసం రాత్రింబవళ్లు శ్రమించి, దాదాపు 40-45% అప్పులను తీర్చగలిగిన సమయంలో, అనుకోకుండా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో బాడీ చెకప్ కోసం వెళ్లినప్పుడు రామానాయుడు గారిని కలుసుకున్నారు. ఈ అనుకోని భేటీ ఆయన జీవితంలో కీలక మలుపునకు దారితీసింది.

రామానాయుడు గారు జయప్రకాష్ రెడ్డిని గుర్తించి, మంచి నటుడివైన నీవు ఎక్కడికి వెళ్లిపోయావని ప్రశ్నించారు. అప్పుల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి వివరించగా, రామానాయుడు గారు కొత్త సినిమా ప్రారంభమవుతుందని, సురేష్ బాబు చూసుకుంటున్నారని, ఒక మంచి పాత్ర ఉందని, వెళ్లి కలవమని సూచించారు. అలా ప్రేమించుకుందాం రా చిత్రంలో విలన్ పాత్ర కోసం జయప్రకాష్ రెడ్డికి అవకాశం లభించింది. ఆ పాత్ర కోసం మొదట అమిష్ పూరీని, ఆ తర్వాత నానా పటేకర్ వంటి వారిని అనుకున్నప్పటికీ, కోటిన్నర బడ్జెట్ ఇబ్బంది కావడంతో రామానాయుడు గారి చొరవతో జయప్రకాష్ రెడ్డికి ఆ పాత్ర దక్కింది. చిత్ర దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, సురేష్ బాబు గార్లు ఆ పాత్రను అవుట్ అండ్ అవుట్ సీరియస్ రోల్‌గా చేయాలని సూచించారు. ఈ పాత్ర కోసం రాయలసీమ యాసను ఎంచుకున్నారు జయప్రకాష్ రెడ్డి. పరుచూరి వెంకటేశ్వర రావు గారి ప్రోత్సాహంతో, డ్రైవర్‌తో కలిసి పది రోజుల పాటు కర్నూలు జిల్లాలోని నంద్యాల, నిరంగాయపల్లె వంటి ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక యాసను, మాండలికాన్ని టేప్ రికార్డర్‌లో రికార్డు చేసి, నోట్స్ రాసుకున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా తాను పొందిన అనుభవం దీనికి ఎంతో సహాయపడిందని ఆయన తెలిపారు. ప్రేమించుకుందాం రా చిత్రం 25 వారాలు ఆడి ఘన విజయం సాధించింది. ఈ చిత్రం జయప్రకాష్ రెడ్డికి ఒక గొప్ప ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టింది. రాయలసీమ యాస ఆయన ట్రేడ్‌మార్క్‌గా మారి, ప్రేక్షకుల్లో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.

ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..

నానా పటేకర్, జయప్రకాష్ రెడ్డి..

Nana Patekar, Jaya Prakash

Nana Patekar, Jaya Prakash

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..