Reading Time: < 1 minute
Redmi Turbo 6 Max 10000mah Battery Ip68 Ip69 Dimensity Chipset Expected Specs

Redmi Turbo 6 Max: రెడ్‌మీ నుంచి అతి త్వరలో కొత్త Turbo 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ సిరీస్‌లో Redmi Turbo 6, Turbo 6 Max మోడళ్లు ఉండే అవకాశం ఉంది. తాజాగా లీకైన వివరాల ప్రకారం.. కొత్త రెడ్‌మీ ఫోన్‌లో భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో పాటు “మీడియాటెక్”కు చెందిన పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

లీకైన వివరాల ప్రకారం.. రెడ్‌మీకి చెందిన మిడ్‌రేంజ్ పెర్ఫార్మెన్స్ ఫోన్లో MediaTek Dimensity 9500s చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. ఫోన్ పేరును నేరుగా వెల్లడించనప్పటికీ.. ఈ వివరాలు Redmi Turbo 6 సిరీస్‌లోని మోడల్‌కు సంబంధించినవిగా అర్థమవుతున్నాయి. అలాగే MediaTek 3nm Dimensity 9600M చిప్‌సెట్‌ను ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ మిడ్-సైజ్ మోడల్ కోసం రిజర్వ్ చేసినట్లు సమాచారం. దీంతో టర్బో 6లో ఉపయోగించనున్న Dimensity 9500sకు భిన్నమైన పొజిషనింగ్ ఉండే అవకాశం ఉంది.

ఈ కొత్త ఫోన్‌లో 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీ ఉంటుందని లీక్ వెల్లడిస్తోంది. గతంలో వచ్చిన నివేదికల్లో Redmi Turbo 6 Maxలో 10,000mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం. దీంతో తాజా లీక్ కూడా టర్బో 6 మాక్స్ గురించే అయి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బ్యాటరీ సామర్థ్యాన్ని రెడ్‌మీ అధికారికంగా ధృవీకరించలేదు. అలాగే టర్బో 6 మాక్స్ లో భారీ డిస్‌ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితమైన స్క్రీన్ పరిమాణం ఇంకా వెల్లడికాలేదు. గత లీక్‌ల ప్రకారం టర్బో 6 మాక్స్లో 7 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 2K రిజల్యూషన్ ఉండే అవకాశం ఉంది.

భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే ఉన్నప్పటికీ ఫోన్ డిజైన్‌ను సింపుల్‌గా ఉంచనున్నట్లు తెలుస్తోంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చని గత నివేదికలు సూచిస్తున్నాయి. కెమెరాలను హారిజాంటల్‌గా అమర్చే అవకాశం కూడా ఉంది. గతంలో వచ్చిన లీక్‌ల ప్రకారం టర్బో 6 మాక్స్లో 3nm Dimensity 9-సిరీస్ చిప్‌సెట్, మెటల్ మిడిల్ ఫ్రేమ్, IP68/IP69 వాటర్‌, డస్ట్ రెసిస్టెన్స్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే విడుదల తేదీ, స్పెసిఫికేషన్లు, ధరపై రెడ్‌మీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.