Reading Time: < 1 minute

బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత..

Caption of Image.

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్(75 ) కన్నుమూశారు.  గోవాలోని డోనా పౌలాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.

ఇవాళ( అక్టోబర్ 8) తెల్లవారుజామున 5:20 గంటలకు ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా అభిమానుల్లో విషాదం నెలకొంది.

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం

నానా పాటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పాటేకర్. హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో వచ్చిన గమన్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.పరిందా, ప్రహార్, అంగార్, క్రాంతివీర్, తిరంగా, ఖామోషి, అబ్ తక్ ఛప్పన్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు విశేష ఆదరణ లభించింది. నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగా కూడా నానా పాటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయనకు 3 చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, 2013లో పద్మశ్రీతో పాటు పలు  ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.

ఇటీవల కూడా ఫిట్‌నెస్‌తో ఆకట్టుకున్న నానా

వయసు పెరిగినా ఫిట్‌నెస్ విషయంలో నానా పాటేకర్ ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఈ ఏడాది ఆయన 15 వరుస ట్రైసెప్ డిప్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటోగ్రాఫర్, నిర్మాత అతుల్ కస్బేకర్ షేర్ చేసిన ఆ వీడియోలో నానా ఎంతో ఉత్సాహంగా వ్యాయామం చేస్తూ కనిపించారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన ఫిట్‌నెస్ అభిమానులను ఆకట్టుకుంది. 

చివరి దశలోనూ సినిమాల్లో యాక్టివ్

నానా పాటేకర్ చివరి వరకు సినిమాల్లో కొనసాగారు. హౌస్‌ఫుల్ 5, ఓ’రోమియో, సుబేదార్ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. నానా పాటేకర్ మరణవార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన విలక్షణ నటన, శక్తివంతమైన డైలాగ్ డెలివరీ, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు

©️ VIL Media Pvt Ltd.