Reading Time: 2 minutes

చలికాలంలో కిటికీ అద్దాలు తడిసిపోతున్నాయా ? స్టీలు చెంచాతో ఈ ట్రిక్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Caption of Image.

చలికాలంలో లేదా వర్షాకాలంలో ఉదయాన్నే లేచి చూస్తే కిటికీ అద్దాలపై నీటి  తేమ కనిపిస్తుంటాయి. గదిలో ఉండే వెచ్చని గాలి బయటి చల్లదనానికి  కిటికీ గాజుపై ద్రవంగా మారుతుంది. దీనివల్ల కిటికీ చెక్క ఫ్రేమ్‌లు పాడవ్వడం, పెయింట్ ఊడిపోవడం, బూజు పట్టడం లాంటి సమస్యలు వస్తాయి. అయితే, కిటికీ గడప (Window sill) పై ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ చెంచా పెడితే ఈ సమస్య తగ్గుతుందని ఇంటర్నెట్‌లో ఒక చిట్కా ప్రచారంలో ఉంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, ఇది నిజంగా పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…

దీని వెనుక ఉన్న సైన్స్ 
ఇది ఏం మంత్రం కాదు, కేవలం ఉష్ణ వాహకత (Thermal Conductivity) సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. గాజు (Glass) కంటే లోహం (Metal/Steel) చాలా వేగంగా వేడిని కోల్పోతుంది ఇంకా త్వరగా చల్లబడుతుంది. రాత్రిపూట   ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, కిటికీ గాజు కంటే దాని పక్కన ఉన్న స్టీలు చెంచా చాలా వేగంగా చల్లబడుతుంది. గాలిలో ఉన్న నీటి ఆవిరి ఎప్పుడు అత్యంత చల్లగా ఉన్న వస్తువు పైనే ముందుగా నీటి చుక్కలుగా మారుతుంది. దీనివల్ల కిటికీ అద్దంపై చేరాల్సిన తేమ అంతా చెంచాపైకి మళ్లుతుంది.

 కిటికీ అద్దం మొత్తం నీటి చుక్కలు  ఫ్రేమ్‌లోకి ఇంకడానికి బదులు, నీరంతా ఒకే చోట అంటే చెంచా ఉన్న ప్రాంతంలో కేంద్రీకృతమవుతుంది. దీనివల్ల ఉదయాన్నే ఒక బట్టతో తుడిచేయడం తేలికవుతుంది

గదిలోని తేమ
 కిటికీపై చెంచా పెడితే గదిలో ఉన్న తేమ అంతా మాయమైపోతుంది, డీహ్యూమిడిఫైయర్ (Dehumidifier) మిషన్ అవసరం లేదు అనేది అపోహ…  చెంచా పెడితే గదిలోని తేమ పరిమాణం తగ్గదు. కానీ అద్దం మొత్తం మీద పడే నీటి చుక్కలు ఒకే చోట పడేలా అది దార మల్లిస్తుంది, అంతే!

చెంచాను ఎలా అమర్చాలి?
ఈ పద్ధతిని ప్రయత్నించాలనుకుంటే…  ఇనుము లేదా వెండి పూత ఉన్నవి వాడితే తుప్పు పడతాయి. స్టీల్ అయితే తుప్పు పట్టదు అందుకే స్టెయిన్‌లెస్ స్టీల్ చెంచానే వాడాలి.  కిటికీ గడప (Sill) కింది భాగంలో చెంచాను పెట్టాలి. చెంచా గుంట భాగం (Bowl) కిటికీ గాజు వైపు చూస్తున్నట్లు, హ్యాండిల్ గది వైపు ఉన్నట్లు పెట్టాలి.ప్రతి ఉదయం చెంచాను తీసి, అక్కడ చేరిన నీటిని మైక్రోఫైబర్ క్లాత్‌తో తడి లేకుండా తుడిచేయాలి.

కిటికీ చెక్క ఫ్రేమ్‌లు, పెయింట్ పాడవకుండా చూడటానికి ఇదొక మంచి టెంపరరీ చిట్కా మాత్రమే. కానీ మీ ఇంట్లో రోజు విపరీతంగా తేమ చేరుతుంటే, అది సరైన గాలి వెలుతురు (Ventilation) లేకపోవడం వల్ల కావచ్చు. బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు సరిగ్గా వాడటం, ఇంట్లో తడి బట్టలు ఆరేయకపోవడం లేదా డీహ్యూమిడిఫైయర్ వంటి పరికరాలను ఉపయోగించడం ద్వారా తేమ సమస్యను శాశ్వతంగా అదుపు చేయవచ్చు.

©️ VIL Media Pvt Ltd.