Reading Time: 2 minutes
Instagram Muse Ai Agent What Is It Features How To Use Availability

Instagram MUSE: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లలలో చాలామందికి షేర్ మెనూలో మ్యూజ్‌ (MUSE) అనే కొత్త ఆప్షన్ కనపడుతోంది. మొదట చూస్తే ఇది పోస్టులు లేదా రీల్స్‌ను షేర్ చేసేందుకు సంబంధించిన ఫీచర్‌లా అనిపించినా.. కానీ ఇది మెటా (Meta) కొత్తగా తీసుకొచ్చిన Muse AI ఏజెంట్. సాధారణ చాట్‌బాట్‌లా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం, నిర్వహించుకోవడంలో యూజర్లకు సాయం చేయడమే దీని ఉద్దేశం.

MUSE అంటే ఏమిటి?

కొంతమంది ఇంస్టాగ్రామ్ యూజర్ల షేర్ మెనూలో మ్యూజ్‌ (MUSE) అనే కొత్త ఆప్షన్ కనిపించవచ్చు. దానిపై ట్యాప్ చేస్తే “మ్యూజ్‌ ఫ్రమ్ మెటా” యాప్ లిస్టింగ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మ్యూజ్‌ ను “Your personal AI agent”గా పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ ఒకే విధంగా అందుబాటులో లేదు. కొన్ని ప్రాంతాల్లో యాప్ లిస్టింగ్ కనిపిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం అందుబాటులో లేదనే సమాచారం కనిపిస్తోంది. అంటే అన్ని దేశాల ఇంస్టాగ్రామ్ యూజర్లకు ఒకేసారి MUSE యాక్సెస్ లభించడం లేదు. భారతదేశంలో కూడా దీని యాక్సెస్ ఇంకా లభించలేదు.

ఈ కొత్త ఫీచర్ ను ఒక పనికి సంబంధించిన పలు దశలను అర్థం చేసుకుని వాటిని ప్లాన్ చేసుకునేలా రూపొందించారు. ఉదాహరణకు టికెట్ల ధరలను గమనించడం, సరైన సమయంలో రిజర్వేషన్ చేసుకోవడంలో ఇది సాయం చేయగలదు. అలాగే ఈమెయిల్‌లో ఏదైనా ఫారం వస్తే దాన్ని పూర్తి చేయడంలో, తదుపరి ప్రక్రియను అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. అవసరమైన పనులకు రిమైండర్లను సెట్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది.

అంతేకాదు దీనిని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కొన్ని పనుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. యూజర్ ఖర్చులను పరిశీలించి, ఎక్కడ సేవింగ్స్ చేసే అవకాశం ఉందో గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు ఒకేసారి అనేక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు కొనసాగుతున్నట్లయితే.. వాటిలో ఏవైనా అవసరం లేకపోతే గుర్తించడంలో ఇది సాయం చేయగలదు. అయితే ఏదైనా చెల్లింపు లేదా ఖర్చుకు తుది అనుమతి ఇచ్చే నిర్ణయం మాత్రం యూజర్ చేతిలోనే ఉంటుంది.

రోజువారీ పనులతో పాటు పెద్ద లక్ష్యాలను కూడా దీని ద్వారా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో డిన్నర్ రిజర్వేషన్స్, మారథాన్ ప్రెప్, సేవ్ ఫర్ న్యూ కార్ వంటివి కనపడుతాయి. అంటే యూజర్ తన లక్ష్యాన్ని చెబితే, దాన్ని సాధించడానికి అవసరమైన పనులను దశలవారీగా ప్లాన్ చేసుకోవడంలో AI సహాయపడుతుంది.

అనేక యాప్స్‌తో కనెక్ట్

మ్యూజ్‌ ను వివిధ యాప్స్, సర్వీసులతో కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో జిమెయిల్, గూగుల్ క్యాలెండర్, హెల్త్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, పెలోటోన్, ఫైనాన్స్ వంటి కనెక్షన్లు ఉన్నాయి. వీటి సర్వీసులను కనెక్ట్ చేసిన తర్వాత యూజర్‌కు సంబంధించిన వివిధ పనుల సమాచారంతో పనిచేయగలదు. అయితే ఏ కనెక్షన్ లేదా ఫీచర్ అందుబాటులో ఉంటుంది అనేది యూజర్ ఉన్న ప్రాంతం, సేవల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.