
మెదక్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎం & హెచోఓ మెదక్) ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 రకాల వైద్య, పారామెడికల్, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 64.
విభాగాల వారీగా ఖాళీలు: ఎంఎల్‌హెచ్‌పీ/ సీహెచ్ఓ/ ఎంఓ/ పల్లె దవాఖానా 10, లాబ్ టెక్నీషియన్ గ్రేడ్–II 4, కౌన్సెలర్ సీహెచ్‌సీ ఎన్సీడీ క్లీనిక్ 1, ఫిజియోథెరపిస్ట్/ ఆక్యుపెషనల్ థెరపిస్ట్ 1, స్టాఫ్ నర్స్ 31, ఏఎన్ఎం 10, ఫార్మసిస్ట్ 5, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ 1, టీబీహెచ్వీ 1.
విద్యార్హతలు
ఎంఎల్‌హెచ్‌పీ/ సీహెచ్ఓ / ఎంఓ / పల్లె దవాఖానా: ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ బీఎస్సీ నర్సింగ్‌తోపాటు సీపీసీహెచ్ పూర్తిచేసి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: డీఎంఏఎల్టీ/ ఎంఏఎల్ టీ/ బీఎస్సీ ఎంఏఎల్టీతోపాటు అప్రెంటిస్‌షిప్ అండ్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
కౌన్సెలర్ సీహెచ్ఎస్ఎన్సీడీ క్లినిక్: ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఫిజియోథెరపిస్ట్ / ఆక్యుపేషనల్ థెరపిస్ట్: బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీతోపాటు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
స్టాఫ్ నర్స్: బీఎస్సీ నర్సింగ్ / జీఎన్‌ఎంతోపాటు రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
ఏఎన్‌ఎం: పదో తరగతితోపాటు 18 నెలల ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) ట్రైనింగ్‌తోపాటు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
ఫార్మసిస్ట్: బి .ఫార్మసీ / డి.ఫార్మసీతోపాటు రిజిస్ట్రేషన్ ఉండాలి.
డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్: ఎంబీఏ (హెల్త్ అడ్మినిస్ట్రేషన్) కలిగి ఉండాలి.
టీబీహెచ్వీ: గ్రాడ్యుయేట్ / ఇంటర్మీడియట్ తోపాటు ఎంపీడబ్ల్యూ / ఎల్‌హెచ్‌వీ/ ఏఎన్ఎం అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్, ఎన్ సీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 5.
లాస్ట్ డేట్: అక్టోబర్ 14.
సెలెక్షన్ ప్రాసెస్: మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ medak.telangana.gov.inను సందర్శించండి.
మల్టీ పర్పస్ వర్కర్ ఖాళీలు
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
విభాగాల వారీగా ఖాళీలు: ఆయూష్ డాక్టర్ (పీజీ అర్హతతో) 1, ఆయూష్ మెడికల్ ఆఫీసర్ 6, డైటీషియన్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1, మల్టీ పర్పస్ వర్కర్ 6.
విద్యార్హతలు
ఆయుష్ డాక్టర్ (పీజీ అర్హతతో): ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
ఆయుష్ మెడికల్ ఆఫీసర్: ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతిలో డిగ్రీతోపాటు 4 సంవత్సరాల 6 నెలల కోర్సు, ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
డైటీషియన్: బీఎస్సీ న్యూట్రిషన్ పూర్తిచేసి ఉండాలి.
సైకోసోషల్ కౌన్సెలర్: మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
యోగా ప్రొఫెషనల్: నేచురోపతిలో డిగ్రీ లేదా నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్‌లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
మల్టీ పర్పస్ వర్కర్: ఏడో తరగతి ఉత్తీర్ణతతోపాటు సైకిల్ లేదా మోటార్ సైకిల్ నడపగలగాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 12.
లాస్ట్ డేట్: అక్టోబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 90 శాతం, అభ్యర్థి వయసు ఆధారంగా ఇచ్చే ఏజ్ వెయిటేజీకి 10 శాతం కేటాయించారు.
రాత పరీక్ష: మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుల కోసం ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ hyderabad.telangana.gov.inను సందర్శించండి.