Reading Time: < 1 minute
Aggipette Macha: ఆ అమాయకపు తింగరి కోపం చెదిరిపోయింది.. ఆ మహామ్మారే బలితీసుకుంది

ప్రముఖ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టి మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. గత నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యూట్యూబ్ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న కిరణ్ కుమార్ ‘అగ్గిపెట్టి మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చేసిన కామెడీ వీడియోలు, వినోదాత్మక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. తిరుపతికి చెందిన కిరణ్.. ‘అగ్గిపెట్టె మచ్చ’గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పే డైలాగులు, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూసి జనాలు తెగ నవ్వుకునేవాళ్లు. దీంతో సినిమా సెలబ్రిటీలతో సమానంగా ఆయనకు కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ వీడియోలు, మీమ్స్ లే కనిపించేవి. చివరకు యూట్యూబ్ ఛానెల్స్ సైతం ఆయన ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టేవి.అయితే ఏమైందో కానీ గత కొంత కాలంగా కిరణ్ కనిపించడం లేదు. వీడియోలు, రీల్స్ కూడా చేయడం లేదు. అసలు అగ్గి పెట్టె మచ్చా ఏమైపోయాడు? అని అనుకుంటోన్న సమయంలో ఈ విషాద వార్త వెలువడింది. ఈ పరిస్థితిలో తీవ్ర అనారోగ్యంతో అక్టోబర్ 05న తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చేరిన కిరణ్‌కు.. గత రెండు రోజులుగా వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ

భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?

దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి

శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు

Rakul Preet Singh: మీరు అనుకుంటున్నట్టు నాకు ఎవరూ గిఫ్ట్‌లు.. విల్లాలు ఇవ్వలేదు!