Reading Time: 2 minutes
Nana Patekar : IIT ర్యాంకర్ నుంచి నేషనల్ అవార్డు వరకు.. నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత రష్మిక మందన్నా సినిమాతో మైండ్ బ్లాంక్..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు నానా పటేకర్. దశాబ్దాలుగా వైవిధ్యమైన పాత్రలు, సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఆయన.. గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలిసినా, ఆయన భార్య నీలకంటి పటేకర్ గురించి మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు. ఆమె కేవలం ఒక స్టార్ హీరో భార్య మాత్రమే కాదు,అంతకు మించి అద్భుతమైన ప్రతిభ, మేధస్సు కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పుణేకు చెందిన నీలకంటి ప చిన్నతనం నుంచే చదువులో అత్యంత ప్రతిభావంతురాలు. మన దేశంలో అత్యంత కష్టతరమైన IIT ప్రవేశ పరీక్షలో ఆమె ర్యాంక్ సాధించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఇంజనీరింగ్ లేదా సైన్స్ రంగంలో నెలకు వేలల్లో ప్యాకేజీ పొందే మహత్తర అవకాశం ఆమె ముందు ఉన్నప్పటికీ, నాటకరంగం , నటనపై ఉన్న అమితమైన మమకారంతో ఆమె తన ధ్యాసనంతా థియేటర్ ఆర్టిస్ట్‌గానే మలిచారు.

ఎక్కువమంది చదివినవి :  మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..

సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నీలకంటి మరాఠీ థియేటర్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. 1973లో జరిగిన మహారాష్ట్ర స్టేట్ డ్రామా కాంపిటీషన్‌లో ఉత్తమ నటిగా ‘గోల్డ్ మెడల్’ కైవసం చేసుకున్నారు. 1989లో సచిన్ పిల్‌గాంకర్ దర్శకత్వం వహించిన ‘ఆత్మవిశ్వాస్’ సినిమాలో ఆమె కనబరిచిన అద్భుత నటనకుగాను మహారాష్ట్ర ప్రభుత్వంచే “ఉత్తమ నటి” పురస్కారాన్ని అందుకున్నారు. నాటకాలే నానా పటేకర్, నీలకంటిల మధ్య పరిచయాన్ని పెంచాయి. 1978లో వీరిద్దరూ కేవలం రూ. 750 ఖర్చుతో అత్యంత సరళంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో వారి మొదటి కుమారుడు రెండున్నరేళ్ల వయసులోనే కన్నుమూయడం ఆ దంపతులను తీవ్రంగా కలచివేసింది. అనంతరం వారికి మల్హర్ పటేకర్ అనే కుమారుడు జన్మించాడు.

ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..

కుటుంబ బాధ్యతల కోసం చాలా ఏళ్లు నటనకు దూరంగా ఉన్న నీలకంటి, ఇటీవలే భారీ చారిత్రాత్మక చిత్రం ‘ఛావా’లో ‘ధరావు’ పాత్ర ద్వారా వెండితెరపైకి అద్భుతమైన రీ-ఎంట్రీ ఇచ్చారు. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాలో ఆమె తన నటనతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఐఐటీ వంటి గొప్ప అవకాశాన్ని పక్కనపెట్టి, కళనే ప్రాణంగా భావించిన నీలకంటి పటేకర్ జీవితం నిజంగానే ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..

నీలకంటి పటేకర్..

 

View this post on Instagram

 

A post shared by Neelu Patekar (@neelkantipatekar)

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..