Reading Time: < 1 minute

నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13న దొంగ నా కొడుకు విడుదల..

Caption of Image.

‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనుజ్ ప్రశాంత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘దొంగ నా కొడుకు’.  ఈ రాబరీ క్రైమ్ కామెడీ మూవీకి శ్రీను కంబళ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13న ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రేక్షకుల ముందుకొస్తోంది. మేకర్స్‌‌‌‌ ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఇందులో మౌళి సోఫా మధ్యలో కూర్చొని షాక్, భయంతో చూస్తుండగా, తల్లిదండ్రుల పాత్రల్లో అలీ, రజిత కనిపిస్తున్నారు. 

రజిత సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తన వైపు చూస్తుంటే అలీ ఫన్నీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నారు. టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టుగా తల్లిదండ్రులు, కొడుకు మధ్య ఉండే సరదా అనుబంధం సినిమాలో కీలకంగా ఉండబోతోందని మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు. రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపిస్తుండడంతో ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత స్పీడు పెంచబోతున్నారు.  

నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ యెర్నేని కో ప్రొడ్యూసర్.  సుశ్మిత శెట్టి హీరోయిన్. రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు.  సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తున్నాడు. 
 

©️ VIL Media Pvt Ltd.