Reading Time: 2 minutes
జస్ట్ రూ.500లతో ఇన్ని వస్తువులు కొనొచ్చా? అది కూడా రూ.129 ఆదా చేసి.. ఈ సీక్రెట్‌ ఇన్నాళ్లు తెలీదే!

మన ఇంట్లో వాడే నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ భారీ పెరిగిపోతూ ఉండడంతో.. నెలవారీ కిరాణా బడ్జెట్‌ను నిర్వహించడం సమాన్య ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ముఖ్యంగా లిమిటెడ్‌ బడ్జెట్‌తో నెలవారి ఖర్చులను మెయింటేన్ చేసే వారికి ఇది పెద్ద సవాలనే చెప్పాలి. ఎందుకంటే వారి బడ్జెట్‌లో బియ్యం, పప్పులు, వంటనూనె వంటి వస్తువుల కొనడం కష్టంగా మారుతోంది. కానీ సరైన ప్రణాళికతో డి-మార్ట్ వంటి సూపర్ మార్కెట్లలో వీటిని కేవలం రూ. 500 బడ్జెట్‌లోనే కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రూ.500లో ఇంట్లోకి కావాల్సిన ఏ ఏ వస్తువలు కొనొచ్చో ఇక్కడ చూద్దాం.

రూ. 500 బడ్జెట్ లో ఏ ఏ వస్తువులు కొనొచ్చు?

హైదరాబాద్‌ వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారు డీమార్ట్ స్టోర్లు లేదా డీమార్ట్ రెడీ ప్లాట్‌ఫామ్‌లో దొరికే డిస్కౌంట్లను వాడుకొని కేవలం రూ. 500 లోపే ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర కిరాణ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు మీ ఇంట్లో కావాల్సిన వస్తువుల ధరలు డిమార్ట్‌లో చూసుకుంటే.. ఒక కేజీ బియ్యం: రూ. 71, ఒక కేజీ శనగపప్పు: రూ. 119 , 500 గ్రాముల మసూర్ పప్పు: రూ. 50 , 870 గ్రాముల రైస్ బ్రాన్ ఆయిల్: రూ. 177 , 500 గ్రాముల అటుకులు: రూ. 40.. ఈ ఐదు నిత్యావసర వస్తువుల మొత్తం ఖర్చు కలిపితే కేవలం రూ. 457 మాత్రమే అవుతుంది. మన ఇంట్లో రోజువారికి వంటకు కావాల్సిన బియ్యం, పప్పు, నూనెతో పాటు బ్రేక్‌ఫాస్ట్‌కు కావాల్సిన అటుకులు కూడా జస్ట్ రూ.500 బడ్జేట్‌లో వచ్చేస్తాయి.

మిగిలిన రూ. 43తో ఆ రోజు అవసరానికి తగినట్లుగా ఉప్పు ప్యాకెట్, చిన్న మసాలా దినుసులు, లేదా అర కిలో ఉల్లిపాయలు, కొద్దిపాటి కూరగాయలను కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఇలా స్మార్ట్‌గా షాపింగ్ చేస్తే మీ రోజువారి ఇంట్లోకి కావాల్సిన వస్తువులను ఈజీగా పొందవచ్చు. అంతేకాదు బయట ధరలు, MRPతో పోల్చుకుంటే డీమార్ట్‌లో మీకు తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి. అవును MRP, ఢీమార్ట్ ధరలను పోలిస్తే.. ఈ తేడా మీకే తెలుస్తోంది.

డిమార్ట్ డిస్కౌంట్స్‌తో ఎంత ఆదా చేయవచ్చు!

నార్మల్‌ బియ్యం ఎంఆర్‌పి ధర రూ. 90 ఉంటే డీమార్ట్‌ డిస్కౌంట్‌లో మీకు ధర రూ. 71కే లభిస్తుంది. అలాగే శనగపప్పు ఎంఆర్‌పి రూ. 153 కాగా డిమార్ట్‌ డిస్కౌంట్‌తో అది రూ. 119 వస్తుంది. ఇలా మసూర్ పప్పు ఎంఆర్‌పి రూ. 68 కాగా డిస్కౌంట్ ధర రూ. 50, నూనె ఎంఆర్‌పి రూ. 219 కాగా తగ్గింపుతో రూ. 177, అటుకులు ఎంఆర్‌పి రూ. 56 కాగా డిస్కౌంట్ ధర రూ. 40కి వస్తాయి. వీటిని మీరు ఆఫర్ లేకుండా పూర్తి MRP ధర చెల్లించి కొంటే.. మొత్తం రూ.586 అవుతుంది. కానీ డీమార్ట్ డిస్కౌంట్‌లో ఇవి మీకు కేవలం రూ. 457కే వస్తాయి. అంటే ఈ స్మార్ట్ షాపింగ్ ద్వారా మీరు రూ. 129 వరకు ఆదా చేయవచ్చు.

Note: అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి.. ఈ ధరలు ఉదాహరణా తీసుకొరి సారినవి.. మాత్రమే.. మీరు వెళ్లే సమయానికి అక్కడ ధరలు మారీ ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.