Reading Time: < 1 minute

గడువులోగా సర్ పూర్తి చేయాలి.. మంచిర్యాల కలెక్టరేట్ లో సమీక్ష

Caption of Image.
  •  రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి,  జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగిత రాణా

నస్పూర్, వెలుగు:  మంచిర్యాల జిల్లాలో చేపట్టిన  ‘సర్’ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి,  జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగిత రాణా అధికారులను ఆదేశించారు. బుధదవారం మంచిర్యాల కలెక్టరేట్‌‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. 

 ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మ్యాపింగ్ కాని, అనమోలీస్ ఓటర్ల నోటీసుల పంపిణీ పూర్తయిందని, 18 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఎన్నికల సంఘం జారీ చేసిన 11 డాక్యుమెంట్లలో సరియైన పత్రాలను మాత్రమే సమర్పించేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని, ఒకే కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూస్తూ, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, మంచిర్యాల ఆర్డీవో  శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.