Reading Time: < 1 minute
Cjp Warns Of Fresh Protest Accuses Centre Of Breaching Agreement

CJP: నిరసనకారులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయని, కేసుల ఉపసంహరణనపై కేంద్రం తమకు ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తోందని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆరోపించింది. మళ్లీ దేశవ్యాప్త నిరసనలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. కేంద్ర విద్యశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ తన నిరసనను విరమించింది. కేంద్రంతో చర్చల సమయంలో విద్యార్థులపై కేసులు ఎత్తివేతపై కేంద్రం అంగీకరించిందని సీజేపీ చెబుతోంది. కేసులు విత్ డ్రా చేయకుపోతే రేపటి నుంచి మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించారు.

నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) వెంటనే ఉపసంహరించుకోవాలని, అదుపులోకి తీసుకున్న విద్యార్థులను విడుదల చేయాలని మరియు వాలంటీర్లపై నిఘా, వేధింపులను ఆపాలని సీజేపీ డిమాండ్ చేసింది. నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తోదని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా ఎక్స్‌లో ఆరోపించారు. బీహార్, బెంగాల్‌లలో వందలాది విద్యార్థుల్ంని అరెస్ట్ చేస్తున్నారని, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో వందలాది మందిపై నిఘా ఉంచి వేధిస్తున్నారని, నిరసనకారులకు లాజిస్టిక్స్ సపోర్ట్ అందించిన వాలంటర్లను వేధిస్తున్నారని ఆరోపించారు.

నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని, మరియు బీజేపీ పాలిత లేదా బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాల్లోని ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు లేదా పోలీసు బలగాలు కొత్త కేసులు నమోదు చేయకూడదని సీజేపీ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో మళ్లీ నిరసనలో కూర్చుంటామని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. కేసులు ఎత్తేస్తామనే హామీని లిఖితపూర్వకంగా తమకు బుధవారం లోగా ఇవ్వాలని సీజేపీ కోరింది.

సోమవారం నాడు సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది మరియు ఎస్పీ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో, సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించిన తర్వాత జూలై 25న ఆందోళనను విరమించుకున్నామని, అయితే ఆందోళన తగ్గుముఖం పట్టిన కొద్దీ విద్యార్థులను ఒక్కొక్కరిగా లక్ష్యంగా చేసుకుంటారని తాము ముందే ఊహించామని తెలిపారు. కేసుల్లో చిక్కుకున్న విద్యార్థుల న్యాయసహాయం కోసం ‘‘సాక్షి’’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించినట్లు సీజేపీ ప్రకటించింది.