Reading Time: < 1 minute
When Will Vaibhav Suryavanshi Play Next Indias Young Star Set For West Indies T20 Series

Vaibhav Sooryavanshi: జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు హాఫ్‌ సెంచీలతో ఆకట్టుకున్న ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకుని తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. హరారే వేదికగా అతని దూకుడు బ్యాటింగ్ అభిమానులను మాత్రమే కాదు, మాజీ క్రికెటర్లను కూడా ఆకట్టుకుంది. వైభవ్ ప్రదర్శనపై స్పందించిన భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ అతడిని వన్డే జట్టులో కూడా అవకాశం ఇవ్వాలని సూచించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రదర్శన చేయడం విశేషమని ఆయన ప్రశంసించారు.

అయితే వైభవ్ అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయం ఏమిటంటే, అతని తదుపరి అంతర్జాతీయ మ్యాచ్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. భారత జట్టు తదుపరి శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుండగా, వైభవ్ ప్రస్తుతం టెస్ట్ జట్టులో భాగంగా లేడు. దీంతో ఆ సిరీస్‌లో అతను కనిపించడు. కానీ, ఈ ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో భారత్ స్వదేశంలో ఆడనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో వైభవ్ మళ్లీ బరిలోకి దిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మూడు వన్డేల తర్వాత జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతనికి స్థానం దాదాపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి.

వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్ 2026 అక్టోబర్ 6న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. జింబాబ్వే పర్యటనలో తన సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ మరోసారి భారత జెర్సీలో మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. వైభవ్‌ ఏ మ్యాచ్‌లోన తగ్గకుండా పరుగుల వరద పారించాలని.. తన బ్యాట్‌ నుంచి వచ్చే సొగసైన సిక్సర్లు చూడాలని.. మెరుపులాంటి.. ఫోర్లు ఆస్వాదించాని ఎదురు చూస్తున్నారు..