July 15, 2026

SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..

SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
Reading Time: < 1 minute
Eci Revises Telangana Voter List Special Intensive Revision Schedule 2026 Dates

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత తేదీగా అక్టోబర్ 1వ తేదీ నాటికి ఓటర్ల వివరాల సవరణను పరిగణనలోకి తీసుకుంటూ నూతన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నూతన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇప్పటికే జూన్ 25 నుంచి ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పనులను సైతం అధికారులు ఆగస్టు 3 నాటికి పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా (Draft Publication) అధికారికంగా విడుదల కానుంది.

ముసాయిదా జాబితా విడుదలైన అనంతరం, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు , తప్పుల మార్పులు-చేర్పులకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణకు ఎన్నికల సంఘం నెల రోజుల పాటు గడువునిచ్చింది. ప్రజలు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు తమ దరఖాస్తులను సమర్పించే అవకాశం కల్పించారు.

ప్రజల నుంచి వచ్చే ఈ అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు సంబంధించిన నోటీసుల జారీ, వాటి పూర్తి స్థాయి పరిష్కార ప్రక్రియను అధికారులు ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత అన్ని సవరణలతో కూడిన తుది ఓటర్ల జాబితాను (Final Publication) అక్టోబర్ 12న అధికారికంగా ప్రకటించనున్నారు.