ఫైట్ మహా’ టీజర్ లాంచ్ చేసిన రామ్ గోపాల్ వర్మ

సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఫైట్ మహా’. కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ట్యాగ్ లైన్. ఆనంద్ చంద్ర దర్శకత్వంతోపాటు ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు దర్శకులు వంశీకృష్ణ ఆకెళ్ళ, రైటర్ బీవీఎస్ రవి, రచయిత సిరాశ్రీ అతిథులుగా పాల్గొని ఆల్ ద బెస్ట్ చెప్పారు. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు.