July 15, 2026

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్‌‌‌‌కు శిక్షణ..జూలై17 నుంచి అప్లికేషన్లు స్టార్ట్

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్‌‌‌‌కు శిక్షణ..జూలై17 నుంచి అప్లికేషన్లు స్టార్ట్
Reading Time: < 1 minute

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్‌‌‌‌కు శిక్షణ..జూలై17 నుంచి అప్లికేషన్లు స్టార్ట్

Caption of Image.
  • బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్‌‌‌‌కు శిక్షణ
  • 17 నుంచి అప్లికేషన్లు స్టార్ట్

హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్)–2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవాలని, వచ్చే నెల16న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు మంగళవారం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

వచ్చే నెల 24 నుంచి 150 మందికి శిక్షణ అందించనున్నామని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేల స్టైఫండ్, పుస్తకాల కొనుగోలుకు రూ. 5 వేలు, లైబ్రరీ, నిపుణులతో శిక్షణ, స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, గైడ్‌‌‌‌లైన్స్ అవకాశం కల్పిస్తున్నట్టు హరికృష్ణ వెల్లడించారు. అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర లోపు, పట్టణ ప్రాంతాల్లో  రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలని ఆయన సూచించారు.

©️ VIL Media Pvt Ltd.